
మండలంలోని పెద మేడపల్లి గ్రామంలో జగనన్న కాలనీ నుండి మోడల్ స్కూల్ కి వెళ్లే వరకు రోడ్డుకి ఇరువైపులా ఏపుగా పిచ్చి మొక్కలు పెరిగి ప్రమాదాలకు సూచనలుగా ఉండడంతో వాహనదారులు ఎంతో ఇబ్బందులకు గురి కావలసి వచ్చేది. ఒక వాహనం ఎదురుగా వస్తే వేరొక వాహనం తప్పించుకోవడం కష్టం గా ఉండేది. మోడల్ స్కూల్ కు సైకిల్ పై వెళ్లే విద్యార్థులకు ఎక్కడ ప్రమాదం ముంచుకొస్తుందమోనని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసేవారు. ఈ తరుణంలో దసరా సందర్భంగా గ్రామ యువ నాయకులు రెడ్డి విజయ నాయుడు సొంత నిధులతో పూడి చంద్రు నాయుడు ఆధ్వర్యంలో మంగళవారం జెసిపి, బ్లేడ్ ట్రాక్టర్ లతో రోడ్డుకి ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి ప్రజాప్రయోజకరమైన కార్యమును చేపట్టారు. ఈ కార్యక్రమం పట్ల ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
