ఈరోజు స్థానిక బొడ్డవర లో జిందాల్ నిర్వాసితులు నిరసన కార్యక్రమము చేసారు. కంపెనీ తమని మోసం చేసినా అధికారులు తమకు అండగా నిలబడతారు అని ఆశించాము అని అన్నారు. తమకి న్యాయం చేయాల్సిన భాద్యత కలెక్టర్ గారి పై ఉంది అంటూ, పలు మార్లు ధరఖాస్తు లు సమర్పించినా స్పందిచకపోవడం దురదృష్టం అని అన్నారు. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాల అయినా తమ హక్కుల కొరకు, న్యాయం కొరకు నెలల తరబడి నిరసన చేస్తున్నా అధికారుల నుండి స్పందన రాకపోవడం బాధాకరం అని అన్నారు. రైతులు కి అండగా నిలబడాల్సిన వారు బడా సంస్థల తరపున నిలబడటం ప్రజాస్వామ్య దేశం యొక్క లక్షణం కాదు అని అన్నారు. తమ భూములు తమకే సొంతం జిందాల్ కి ఇవ్వము అంటూ గట్టి గా నినాదాలు చేసారు. న్యాయం కోసం ఎన్ని రోజులు అయినా పోరాడుతాం అంటూ రేపటి నుండి నిరాహార దీక్షలు చేస్తాం అని అన్నారు.
0 Less than a minute


