A2Z सभी खबर सभी जिले की

*||సమిష్టి సహకారంతోనే జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపాం||*

*'ఆత్మీయ వీడ్కోలు' కార్యక్రమంలో విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్*

 

విజయనగరం జిల్లా ఎస్పీగా 14 నెలలు పని చేసి గుంటూరు జిల్లాకు బదిలీపై వెళ్ళిన వకుల్ జిందల్, ఐపిఎస్ గారికి మరియు కమాండెంట్ శ్రీమతి మాలిక గార్గ్, ఐపిఎస్ దంపతులకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో
పట్టణంలోని మెట్రో ఫంక్షన్ హాలులో సెప్టెంబర్ 21న ఘనంగా ‘ఆత్మీయ వీడ్కోలు పలికారు.

ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – తన సర్వీసులో జిల్లాలో పని చేయడం ఒక మధుర స్మృతిగా నిలుస్తుందన్నారు. జిల్లాలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది, ప్రజలు అందించిన సహకారంతో జిల్లాను రాష్ట్రంలోనే దాదాపు అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో నిలిపామన్నారు. జిల్లా ప్రజలు చాలా సౌమ్యులని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుశాఖ చేపట్టిన చర్యలకు ప్రజలు తమవంతు సహకారాన్ని అందించారన్నారు. గంజాయి అక్రమ రవాణ నియంత్రణకు చేపట్టిన చర్యలు ఫలితంగా గంజాయి వ్యాపారులను కట్టడి చేసామన్నారు. గంజాయి వ్యాపారంలో క్రియాశీలల పాత్ర పోషించే ప్రధాన నిందితులను కూడా అరెస్టు చేసి, వారి ఆస్తులను అటాచ్ చేసామన్నారు. ప్రజలు, పోలీసు అధికారులు, సిబ్బంది సమిష్టిగా, సమన్వయంతో పని చేయడం వలనే జిల్లాలో నేర నియంత్రణలోను, చేధనలోను మంచి ఫలితాలు సాధించామన్నారు. జిల్లాలో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికారులు, సిబ్బంది చాలా సమర్ధవంతంగా, అంకిత భావంతో పని
చేసారన్నారు. కారణాలు లేకుండా అర్ధ రాత్రి సమయాల్లో సంచరించే వారిని కంట్రోల్ చేయడం, మహిళలు, బాలల
భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో ప్రజల మన్ననలు పొందామన్నారు. బాలలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై
నమోదైన కేసుల్లో నిందితులకు ఆరు మాసాల్లోనే శిక్షలు పడే విధంగా చర్యలు చేపట్టామన్నారు. సైబరు నేరాల్లో నిందితులను అరెస్టు చేసి, నగదు రికవరీ చేసి, బాధితులకు అందించామన్నారు. సిసి కెమెరాలను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయించి, నేరాలు జరగకుండా నియంత్రించడంతోపాటు, పలు కేసులను చేధించామన్నారు. కార్యదీక్ష కలిగిన పోలీసు అధికారులు జిల్లాలో పని చేస్తున్నారని, ఇటువంటి అధికారులు, సిబ్బంది ఇతర జిల్లాలో లభించడం కష్టమన్నారు. తాను జిల్లాలో మరో సంవత్సరం పని చేస్తానని భావించానని, ఆకస్మిక బదిలీ జరిగిందన్నారు. జిల్లా ప్రజలను, అధికారులను, సిబ్బందిని విడిచి వెళ్ళడం తనకు చాలా బాధగా ఉందన్నారు. పోలీసుల సంక్షేమానికి కూడా ప్రాధాన్యత కల్పించి సిబ్బందికి కంప్లీట్ హెల్త్ చెకప్లు చేపట్టామన్నారు. అదే విధంగా పోలీసు స్కూలులో మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేసామని, తక్కువ ఫీజులతో పాఠశాల విద్యార్థులు కార్పొరేట్ స్కూల్స్ పోటీపడే రీతిలో ఉన్నత విద్యను అందిస్తున్నామన్నారు. తాను జిల్లాలో పని చేసిన కాలంలో సహకరించిన అధికారులు, సిబ్బందికి ఎస్పీ వకుల్ జిందల్ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

ఎస్పీ మాలిక గార్గ్ మాట్లాడుతూ – మీ మాటలు, చేతలు ద్వారా మాపట్ల మీరు చూపిన అభిమానానికి
కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పని చేయడం తనకు, ఎస్పీ వకుల్ జిందల్ ఎంతో సంతృప్తినిచ్చిందని, మరికొంత కాలం పని చేస్తే బాగుంటుందని భావించామన్నారు. అందరూ సమిష్టిగా, సమన్వయంతో పని చేయడం వలనే
జిల్లాకు తద్వారా తమకు మంచి పేరు వచ్చిందన్నారు.

అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, డిఎస్పీలు ఆర్. గోవిందరావు,
ఎం.శ్రీనివాసరావు, పలువురు సిఐలు, ఆర్ఎస్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఎస్ఐలు ప్రసంగించి ఎస్పీ వకుల్ జిందల్, ఎస్పీ మాలిక గార్గ్ జిల్లాకు అందించిన సేవలను కొనియాడుతూ ప్రసంగించారు.

‘ఆత్మీయ వీడ్కోలు’ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన వకుల్ జిందల్ దంపతులను వేద ఆశీర్వచనంలతోను, మతాబులతో స్వాగతం పలికారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ చేపట్టిన వలు కార్యక్రమాలు, చేపట్టిన చర్యలను వివరిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన ఎ.వి. పలువురిని ఆకట్టుకొంది. అనంతరం, ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారిని, ఎస్పీ మాలిక గార్గ్, ఐపిఎస్ దంపతులను సాలువలతో ఘనంగా సత్కరించి, పుష్ప గుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలిపి, జ్ఞాపికలను బహూకరించి, ఘనంగా ‘ఆత్మీయ వీడ్కోలు పలికారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు పి.సౌమ్యలత, జి.నాగేశ్వరరావు, డిఎస్పీలు ఆర్.గోవిందరావు,
ఎన్.రామవులు, ఎం.వీర కుమార్, ఎం.శ్రీనివాసరావు, పలువురు సిఐలు, రిజర్వు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు,
ఆర్ఎస్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

 

Show More
Back to top button
error: Content is protected !!