
ఈ రోజు మెంటాడ మండలం, గుర్ల గ్రామంనకు చెందిన బొద్దల జగదీశ్ పుట్టిన రోజు సందర్భంగా వారి ఆహ్వానం మేరకు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై. యస్.ఆర్.సీ.పీ.జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త గౌ!! నీ!! శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)గారి *కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షు రాలు సిరమ్మ* గారు జగదీశ్ పుట్టిన రోజు వేడుకలు లో పాల్గొని వారు అక్కడ ఏర్పాటు చేసిన మాతృభూమి సేవా సంఘం ఆధ్వర్యం లో డాక్టర్ నవ్యాస్ గ్లోబల్ క్యాన్సర్ సెంటర్ విశాఖపట్నం, గాయిత్రి కంటి ఆసుపత్రి విజయనగరం వారి సంయుక్త సౌజన్యం తో ఉచిత మెగా వైద్యశిబిరం మరియు స్వచ్ఛంద రక్తదాన శిబిరం లో పాల్గొన్నారు. మరియు యూత్ కి వాలీ బాల్ కిట్, స్కూల్ పిల్లలకు కిట్స్, వృద్ధులకు చీరలు, దుప్పట్లు సిరమ్మ చేతులు మీదుగా పంపిణీ చేసారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానం తో సమానమన్నారు. యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. అదే విధంగా ఈ ప్రాంత ప్రజలు ఉచిత వైద్య శిబిరాన్ని
సద్వినియోగం చేసు కోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
