A2Z सभी खबर सभी जिले की

*విజయవంతమైన విజయనగరం జిల్లా గర్ల్స్ కన్వెన్షన్

***విజయనగరం జిల్లా నూతన గర్ల్స్ కన్వీనర్ గా ర్.శిరీష ప్రశ్నించడం ద్వారానే మన ఆత్మగౌరవం నిలబెట్టుకోగలం ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్వెన్షన్ లో యు టి ఎఫ్ రాష్ట్ర నాయకులు విజయగౌరి

 

 

 

 

Related Articles

 

 

ప్రశ్నించడం ద్వారానే ఆడపిల్లలు ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోగలమని యు టి ఎఫ్ రాష్ట్ర నాయకులు కె .విజయగౌరి పిలుపునిచ్చారు.ఆదివారం స్థానిక జెడ్పీ మినిస్టీరియల్ భవనంలో గర్ల్స్ కన్విన్సింగ్ కమిటి కో కన్వీనర్ శిరీష అధ్యకథన జరిగిన
ఎస్ ఎఫ్ ఐ జిల్లా గర్ల్స్ కన్వెన్షన్ కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
చదువుకునే వారికి ఉపాధి అవసరం.అటువంటి ఉపాధి కావాలంటే అనేక సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పించాలన్నారు.
నూతన విద్యా విధానం వచ్చిన తర్వాత రకరకాల కోర్సులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ క్రమంలో ఈ కోర్సులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేది ఆలోచించాలన్నారు. ప్రభుత్వాలు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉందన్నారు. వాటినీ సాధించుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మౌనంగా ఉంటే సమస్యకు పరిష్కారం రాదన్నారు. నేడు సమాజంలో జరుగుతున్న పరిణామాలు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఆడపిల్లలు చాలా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని,లింగ వివక్ష,లైంగిక వేధింపులు ఉన్నాయన్నారు.నేడు దేశంలో ఒక నిమిషానికి 570 మంది అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురి అవుతున్నారన్నారు. రాష్ట్రంలో విద్యార్థునులకు నాప్కిన్స్ ఇవ్వడంలో విఫలమయ్యారు. నాప్కిన్స్ ప్రభుత్వ బడుల్లో స్టాక్ పెట్టీ దేశంలో వీటిని అందించడంలో కేరళ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు.మన రాష్ట్రం లో బాలికలకు నేడు ఇవ్వడం లేదన్నారు. ఆడపిల్లల వాడుతున్న నాప్కిన్స్ మీద పన్నులు వేయడం దుర్మార్గమన్నారు. నాప్కిన్స్ మీదం జి ఎస్ టి రద్దు చేయాలని పోరాట ఫలితంగా రద్దు చేయడం జరిగిందన్నారు. అందరిలాగా సమస్యలు ఆడపిల్లకు ఉన్నా ప్రత్యేకంగా జెండర్ సమస్యలు ప్రత్యేకంగా ఉన్నాయన్నారు. మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా శాస్త్రీయ దృక్పథం కోసం, అందరితో పాటు సమానత్వం కోసం మనం పోరాటం చేయాల్సి ఉందన్నారు. ప్రధానంగా ఆడపిల్లలు ప్రశ్నించాలన్నారు. ప్రశ్నించడం ద్వారానే మనుగడ ఉంటుందన్నారు. ఆశాస్త్రీయ విధానాలు అమలు జరుగుతున్నప్పుడు వాటిని ప్రశ్నించాలన్నారు. ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు. 12 రకాల హక్కులు ఆడపిల్లలకు రాజ్యాంగం కల్పించడం జరిగిందన్నారు. ప్రశ్నించడం ద్వారానే న్యూటన్ భూమ్యాకర్షణ సిద్ధాంతాన్ని కనిపెట్టడం జరిగిందన్నారు. వ్యక్తిగా,సమాజం నుంచి,ప్రభుత్వం నుంచి మనం ఎదుర్కొనే సంఘటనలపై ప్రశ్నించించడం అలవర్చుకోవాలన్నారు. ప్రశ్నించడం ద్వారానే ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలన్నారు. దేశంలో రేజలర్ల పోరాటం మనకి ఆదర్శమన్నారు. అటువంటి ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలన్నారు. పేదరికాన్ని ఆసరాగా తీసుకొని వేశ్య గృహాలకు కూడా తీసుకెళ్తున్న పరిస్థితులు నేడు ఉన్నాయన్నారు. మన దేశంలో 2035 నాటికి ఆడపిల్లలు సంఖ్య తగ్గనుందని ఐక్య రాజ్య సమితి చెప్పిందన్నారు. ఆడపిల్లలను రక్షించే కార్యక్రమాలు ప్రభుత్వాలు చేయాలని చెప్పడం జరిగిందన్నారు. హర్యానా రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు సమావేశాలు పెట్టీ ఒరిస్సా రాష్ట్రం నుంచి ఆడపిల్లలను తెచ్చుకుంటున్న పరిస్తితి ఏర్పడిందన్నారు. ప్రపంచ సర్వేలో సామాజికంగా, రాజకీయంగా, ఆర్దికంగా మన దేశంలో ఆడపిల్లలు ప్రపంచములో 134 స్థానంలో మనం ఉన్నామన్నారు. అంటే దేశంలో మన ఆడపిల్లలు దయనీయ పరిస్థితికి నిదర్శనంగా ఉందన్నారు. అక్షరాస్యత శాతం 74 శాతం ఉంటే అందులో మహిళలు అక్షరాస్యత స్థానం 62 శాతంగా ఉందన్నారు. వరకట్నాలు వేధింపులు అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. గురజాడ అప్పారావు చెప్పిన పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథ మనకు కల్లు తెరిపిస్తుందన్నారు. గురజాడ అప్పారావు స్పూర్తితో ఆడపిల్లలు సమస్యలు పరిష్కారం కోసం, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకొని పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.అనంతరం ఎస్ ఎఫ్ ఐ జిల్లా కన్వీనర్ సమీరా మాట్లడుతూ నేడు విద్యార్థినిలు ఎదుర్కొంటున్న సమస్యలు పై చర్చించి భవిష్యత్ కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరుగుతుందన్నారు. ఈరోజు జరిగిన జిల్లా గర్ల్స్ కన్వెన్షన్ లో నూతన గర్ల్స్ కన్వినింగ్ కమిటీ 15 మందితో ఎన్నుకోబడింది. నూతన జిల్లా గర్ల్స్ కన్వీనర్ ర్.శిరీష, కో కన్వీనర్లు భారతి,రూప, జయశ్రీ, శ్రీలత ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భంగా నూతన జిల్లా గర్ల్స్ కన్వీనర్ ర్.శిరీష మాట్లాడుతూ సామాజిక,ఆర్ధిక సమాననత్వం కోసం అధ్యయనం పోరాటం నినాదంతో ఎస్ ఎఫ్ ఐ రానున్న కాలంలో మరింత పోరాటాలు ఉదృతం చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ద్.రాము , చ్.వెంకటేష్ జిల్లా నాయకులు అధిక సంఖ్యలో విద్యార్థినిలు పాల్గొన్నారు. అంతకు ముందు గురజాడ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Show More
Back to top button
error: Content is protected !!