A2Z सभी खबर सभी जिले की

విజయనగరంలో దంపతుల ఆత్మహత్య

విజయనగరం వీటీ అగ్రహారంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అగ్రహారంలో నివాసముంటున్న కానూరి పార్వతి (55), సత్యనారాయణ(62) కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి ఇంట్లో పడుకున్నారు. ఉదయం ఎంతకీ లేవకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్‌ ఎస్‌ఐ అశోక్‌ కుమార్‌ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. వారు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక నిర్ధారణలో తేలింది.

Show More
Back to top button
error: Content is protected !!