
విజయనగరంలో ఉన్న గురజాడ అప్పారావు ఇంట్లో బుధవారం ఉదయం జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు బీశెట్టి బాబ్జి శాంతి దీక్షను చేపట్టారు. గురజాడ ఇంటిని ఆధునికరించాలని కోరారు. గురజాడ సాహిత్యాన్ని డిజిటలైజ్ చేయాలన్నారు. గురజాడ జయంతి సెప్టెంబర్ 21న రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని, ఈనెల 4న జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తీర్మానం చేయాలన్నారు.