
మెంటాడ, న్యూస్ : మండలంలో గుర్ల తిమ్మిరాజుపేట గ్రామంలో ని ఎస్సీ ఎస్టీ కాలనీలో గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్యులు వివిధ రకాల రోగుల్ని పరీక్షించి వారికి అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మెంటాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ జి కల్పన మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాతావరణ మార్పులు వలన కలిగే వివిధ రకాల వ్యాధుల పట్ల అవగాహన కలిగి జాగ్రత్తగా ఉండాలనీ తెలిపారు. వ్యక్తిగత శుభ్రత ఇళ్ల పరిసరాల శుభ్రత పాటించాలనీ అన్నారు. వర్షాకాలంలో వ్యాధులు విస్తరించే అవకాశం ఉన్నందున జ్వరం తలనొప్పి కాలు పీకులు ఉన్నట్లయితే తక్షణమే దగ్గర్లో ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లి చూపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎల్ ముత్యాలు నాయుడు, ఏ ఎన్ ఎం పార్వతి, సూపర్వైజర్లు ఆశా కార్యకర్తలు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.