
విజయనగరం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించేందుకు
పోలీసుశాఖ నుండి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా పొందాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జూలై 4న తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు, ఇతర నిరసన కార్యక్రమాలను నిర్వహించేందుకు తప్పనిసరిగా పోలీసుశాఖ నుండి ముందస్తుగా అనుమతులు పొందాలన్నారు. పోలీసుశాఖ నుండి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ధర్నాలు,
ర్యాలీలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టడం చట్టవిరుద్ధమన్నారు. చట్టాన్ని గౌరవించాల్సి బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా ఉందని, అందుకు అనుగుణంగా ప్రతీ ఒక్కరూ నడుచుకొని, శాంతియుతంగా వ్యవహరించాల్సిన
అవసరముందన్నారు. ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు, నిరసనలు తెలియజేసేందుకు ముందుగా సంబంధిత డిఎస్పీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకొని, అనుమతులు పొందాలన్నారు. ఎటువంటి ముందస్తు అనుమతులు పొందకుండా ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు, సమావేశాలు నిర్వహించడం వలన శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్నారు. కావున, ప్రజలు శాంతియుతంగా వ్యవహరించాలని, విజ్ఞతతో వ్యవహరించి ముందస్తు అనుమతులతోనే ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. అలాకాకుండా, చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తూ ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు చేపడితే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరించారు.