
విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని ప్రభుత్వ మెడికల్ కళాశాలలోకి మార్చాలని జిల్లా పౌరవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పురవేదిక జిల్లా అధ్యక్షుడు బీసెట్టి బాబ్జి ఆధ్వర్యంలో ఈ నిరసన కొనసాగింది.
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందికి సరైన సదుపాయాలు లేవని ఈ కారణంగా విశాలంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలోకి మార్చి వైద్య సేవలు అందించాలని కోరారు.