A2Z सभी खबर सभी जिले की

*ప్రభుత్వ ఆదాయం మిగులు కోసం పెన్షన్లు కుదింపు నిర్ణయం సిగ్గు చేటు.*

*-సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్*

ప్రభుత్వ ఆదాయం మిగులు కోసం వికలాంగ, వృద్ధాప్య, వితంతు మొదలైన అర్హులైన వారికి చెల్లిస్తున్న పెన్షన్లు కుదించాలని చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేసిన నిర్ణయం చాల సిగ్గు చేటు అని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) విజయనగరం నియోజకవర్గ సమితి బుధవారం ఉదయం జరిగిన పి. డబ్ల్యూ మార్కెట్ శాఖ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబూ నాయకత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల అమలు చేయడానికి ఖజానాలో డబ్బులు సరిపోవడం లేదని నెపంతో నేటి వరకు అర్హులైన వారికి ప్రభుత్వం చెల్లిస్తున్న సామాజిక పెన్షన్లులలో కోతలు విధించడం అనేది ఒకరి కడుపు కొట్టి మరొకడికి పెట్టినట్టు అన్న చందంగా ఉందని విమర్శించారు. అర్హులైన పేదలకు పెన్షలు రద్దు చేసి ఆ సొమ్ములతో మరొక పథకాన్ని అమలు చేస్తే ఇందులో చంద్రబాబు కూటమి గొప్పతనం ఏముందని ఈ మాత్రానికే ఏదో ఘనకార్యం సాధించినట్టు జెబ్బలు చరచడం ఎందుకని దుయ్యబట్టారు. విజయనగరం జిల్లాలో విభిన్న ప్రతిభావంతులైన వికలాంగ పెన్షన్లకి సంపూర్ణమైన అర్హత కలిగిన వారు మొత్తం 36,550 మంది ఉండగా, అనారోగ్యంతో భాధలుపడుతూ మంచానికే పరిమితమై ప్రభుత్వం నుంచి నెలకి చికిత్స అవసరాల నిమిత్తం నెలకి 15,000 రూపాయిలు ఆర్థిక సాయం పొందుతున్న అర్హులైన వారు మొత్తం 956 మంది, కిడ్నీ వ్యాధితో బాధపడుతు నెలకి చికిత్స అవసరాల నిమిత్తం నెలకి 10,000 రూపాయిలు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందుతున్న వారు మొత్తం 323 మంది ఉండగా అలాంటి అభ్యాగుల నుంచి కూడా ప్రభుత్వం నోటి కాడ కూడు లాక్కోవడం దుర్మార్గమని విమర్శించారు. ఎలాంటి ఆధారం లేక నేటి వరకు ప్రభుత్వం చెల్లిస్తున్న ఆర్థిక సాయంతోనే వారి జీవనాధారం, చికిత్స అవసరాల కోసం ఆధారపడి ఉన్నవాళ్లకు నేడు అధికారంలో ఉన్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం కొత్తకొత్త నిబంధనలు పెట్టీ అర్హులైన వారికి చెల్లిస్తున్న పెన్షన్లు రద్దు చేసే ఆలోచన విరమించుకోవాలని సిపిఐ డిమాండ్ చేస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న పెన్షన్లలో 7000 మందికి అనవసర అభ్యంతరాలు పెట్టీ వాటిని సరి చేసుకోవాలని లేనియెడల పెన్షన్లు రద్దు చేస్తున్నట్టు నోటీసులు ఇవ్వడం వలన మంచాన పడి కదలలేని స్థితిలో ఉన్న వారు మరలా అర్హులమని నిరూపించుకోడానికి అధికారుల చుట్టూ తిరగలేక తీవ్రమైన ఆందోళన చెందుతున్నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు అధికగం కోసం ఎలాంటి నిబంధనలు పెట్టీ ప్రజలను ఇబ్బందులుకి గురి చేయకుండా ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని చెప్పిన చంద్రబాబు మాటలు మోసపురితమైనవి అని మరోసారి నిరూపితమైందని విమర్శించారు. కొత్త నిబంధనలతో ఇబ్బందులు పెడుతూ అర్హులైన వారి పెన్షన్లు రద్దు చేయాలని ఆలోచన వెనక్కి తీసుకోవాలి లేదా అర్హత కలిగిన వారు అర్హతను నిరూపించుకునేందుకు వెళ్ళలేని స్థితిలో ఉన్నారు కాబట్టి ఎక్కడిక్కడ స్థానికంగా శిబిరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న పెన్షన్లు కొనసాగిస్తూ నేటికీ అర్హత కలిగిన కూడా పెన్షన్ వర్తించని వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) డిమాండ్ చేస్తూ పోరాడుతుందని బుగత అశోక్ తెలిపారు.

Back to top button
error: Content is protected !!