ఖాతాదారులకు, రైతులకు మెరుగైన సేవలు అందించాలని విజయనగరం డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున సూచించారు. బుధవారం స్థానిక వీటీ అగ్రహారంలోని డీసీసీబీ బ్రాచిను ఆయన సందర్శించారు. బ్యాంకు ద్వారా అందుతున్న అన్ని రకాల సేవలపై ఆరా తీశారు. బ్రాంచి పరిసరాలు అధ్వానంగా ఉన్నాయని, మెరుగు పరచాలని తెలిపారు. రైతులకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలు అందించడంలో సిబ్బంది అందరూ ముఖ్యపాత్ర పొచించాలని కోరారు.