A2Z सभी खबर सभी जिले की

*క్రికెట్ టోర్నమెంట్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ లో గెలుపొందిన క్రీడాకారులకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసిన సిరిసహస్ర (సిరమ్మ)*

ఈరోజు తగరపువలసలో జరుగుచున్న ప్రీమియర్ లీగ్ సీజన్ 1 లో శనివారం నాడు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వై. యస్.ఆర్.సీ.పీ. జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం వై.యస్.ఆర్. సీ.పీ. సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారి కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ)గారు తగరపువలస ప్రీమియర్ లీగ్ సీజన్ 1 క్రికెట్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందిన క్రీడా కారులందరికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు.
అనంతరం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహదారుధ్యానికి ఉపయోగపడతాయన్నారు. యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి వెలిగితీయాలని వారన్నారు. ఇటువంటి క్రికెట్ టీముల నిర్వహణ వలన క్రీడాకారుల లో ఉన్న నిజమైన ప్రతిభ కనిపిస్తుందన్నారు.ఈ కార్యక్రమం నిర్వహించిన వారికి నాయొక్క ప్రేత్యేక అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జీవీఎంసీ 1 వార్డ్ కార్పొరేటర్ అక్కరమాని పద్మావతి రామునాయుడు, జిల్లా సెక్రటరీ జీరూ వెంకట రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బింగి హరికిరణ్ రెడ్డి, విశాఖ జిల్లా ఫుట్ బాల్ అసో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అక్కరమణి చిన్నబాబు,సీనియర్ నాయకులు వెంపాడ వెంకటరమణ రెడ్డి, పందిరి విజయకుమార్,జీరు శ్రీనివాస్ రెడ్డి, సిమ్మల ప్రసన్న మరియు మరియు చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు పాల్గొన్నారు.

Check Also
Close
Back to top button
error: Content is protected !!