
మెంటాడ, న్యూస్: బిరసాడ వలస గ్రామంలో గల కోళ్ల ఫారం ను తొలగించాలని జనసేన మండల అధ్యక్షుడు సంబ్బరపు రాజశేఖర్ ఆధ్వర్యంలో గత రెండు రోజుల క్రితం తాసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన ఆందోళనదారులకు సమస్య పరిష్కరించే విధంగా చేస్తానని 25వ తేదీ వరకు ఆగమని అధికారులు చెప్పడంతో ఈరోజు అధికారులు రాక కోసం ఎంతో ఎదురు చూసారు. బుధవారం రిలే నిరాహార దీక్షలో కూడా కోళ్ల ఫారం తొలగించండి మా జీవితాలను కాపాడండి అనే నినాదంతో దీక్షా ప్రాంగణం హోరేత్తింది. ఈరోజుతో సమస్య పరిష్కారం కాబోతుందన్న ఆశతో ఉన్న గిరిజనులకు నిరాసే ఎదురయింది. అధికారులు ఏం చెప్తారు అని ఎంతో ఆశతో ఎదురు చూశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ అరుణ్ కుమారి దీక్షా శిబిరంలో ని నాయకులతో మాట్లాడుతూ ఇక్కడ సమస్యను పై అధికారులకు తెలియజేశానని వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానన్నారని వారు త్వరలో కమిటీని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారని తెలిపారు. అనంతరం రాజశేఖర్ మాట్లాడుతూ సమస్య పరిష్కార అయ్యే వరకు మా ఉద్యమం ఆగదని ఇంకా ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి రాజప్పల్ నాయుడు, వివిధ వర్గాల చెందిన నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.