A2Z सभी खबर सभी जिले की

గ్రామస్తులకు ఏదైనా జరిగితే బాధ్యత మాదే

-కోళ్ల ఫారం యజమాని సుధాకర్ రెడ్డి

మెంటాడ, న్యూస్: బిరసాడ వలస గ్రామాన్ని ఆనుకుని ఉన్న కోళ్ల ఫారం తొలగించాలని గత 20 రోజుల నుండి చేస్తున్న రిలే నిరాహార దీక్ష పట్ల కోళ్ల ఫారం యజమాని సుధాకర్ రెడ్డి స్పందించారు. బుధవారం తమ కోళ్ల ఫారం ప్రాంగణంలో అత్యవసర ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ఈ గ్రామంలో కోళ్ల ఫారం ఏర్పాటు చేసి నేటి కి 8 సంవత్సరాలు అవుతుందని ఎప్పుడూ రాని సమస్య ఇప్పుడు వచ్చిందని నేనంటే కిట్టనివారు వారు గిరిజన ప్రజలను రెచ్చగొట్టి ఆందోళన చేపడుతున్నారని వివరణ ఇచ్చారు. ఈ 8 సంవత్సరాల కాలంలో ఒక నెల క్రితం కోళ్ల ఫారం లోని కొన్ని మిషన్లు పాడవడం వలన, జాతీయ రహదారి రోడ్లు నిర్మాణములో భాగంగా మా కాంపౌండ్ లో నుండి పోవడం వలన చుట్టూ ఉన్న చెట్లను నరికి వేయడం వలన దుర్వాసన వచ్చిన మాట నిజమేనని ఆ సమస్యను త్వరితగతిన పరిష్కరించడం జరిగిందని ఇదే అవకాశం గా భావించిన కొంత మంది గిరిజన ప్రజలను రెచ్చగొట్టి కోళ్ల ఫారం ఉండకుండా పూర్తిగా తొలగించేలా వారితో ధర్నాలు దీక్షలు చేపట్టారని వారు చేస్తున్న అసత్య ప్రచారం నమ్మ తగినది కాదని తెలిపారు. ఆ గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఎటువంటి సహాయము కావాలన్నా నేను చేస్తూనే ఉన్నానని ఇంకనూ చేస్తానని పూర్తి బాధ్యత నాదేనని వారికి తెలిపిన వాళ్ళ అమాయకత్వాన్ని ఇతరులు ఆసరాగా తీసుకొని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కోళ్ల ఫారం లో 120 మంది పనిచేస్తున్నారని వారికి ఉపాధి కల్పించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఒకవేళ నిజంగా ఈ గ్రామ ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నా, ప్రజానికానికి హానికరంగా ఉన్న , ఆరోపణలు నిజమని టెక్నికల్ టీం వచ్చి పరిశీలించి వారుకి అనుకూలంగా సర్టిఫై చేస్తే తప్పనిసరిగా ఈ కోళ్ల ఫారం తీసేస్తానని కరాకండిగా తెలిపారు. అనంతరం సూపర్వైజర్లు చంటి, ఎర్రి నాయుడు మాట్లాడుతూ ఈ కోళ్ల ఫారం ద్వారా 120 మంది కి ఉపాధి దొరికిందని ఎనిమిది సంవత్సరాల నుండి ఇక్కడ పనిచేస్తున్న వారికి ఎవరికీ ఎటువంటి అనారోగ్యం కలుగులేదని ఇప్పుడు సడన్ గా కోళ్ల ఫారం తొలగిస్తే మా గతి ఏంటని ప్రశ్నించారు.

Show More
Back to top button
error: Content is protected !!