
జూన్ 21న నిర్వహించిన అంతర్జాతీయ యోగ దినోత్సవం పోలీసు అధికారులు, సిబ్బంది ఇతర శాఖలతో సమన్వయంతో పని చేయడం, బందోబస్తు విధులను సమర్ధవంతంగా నిర్వహించడంతో యోగాంధ్ర కార్యక్రమం. విజయవంతం అయ్యిందని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జూన్ 21న అన్నారు
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ మాట్లాడుతూ – యోగాంధ్ర కార్యక్రమ నిర్వహణలో ఎటువంటి
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేపట్టిన బందోబస్తు, భద్రత విధులను పోలీసు అధికారులు, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించారన్నారు. విశాఖ ఐటి సెజ్ నుండి కాపుల ఉప్పాడ వరకు ఏర్పాటు చేసిన 59 కంపార్టుమెంట్లలో ప్రజలు చేరుకొనే విధంగా ఇతర శాఖల అధికారులతో సమన్వయంతో పని చేశారన్నారు. యోగాంధ్ర కార్యక్రమంకు బస్సుల్లో ప్రజలు చేరుకున్న తరువాత ఆయా వాహనాలకు కేటాయించిన పార్కింగు స్థలాల్లోనే వాహనాలను నిలుపుదల చేశారన్నారు. కార్యక్రమం ముగిసిన తరువాత కూడా ట్రాఫిక్ ఎటువంటి అవాంతరాలు జరగకుండా పోలీసు అధికారులు, సిబ్బంది ట్రాఫిక్ రెగ్యులేషను సమర్ధవంతంగా నిర్వహించారన్నారు. చేసారన్నారు. ముఖ్య వ్యక్తుల భద్రత దృష్ట్యా జిల్లా మీదుగా విశాఖపట్నం వెళ్ళే కొత్తవలస మండలం చింతలపాలెం, డెంకాడ మండలం రాజాపులోవ వద్ద రెండు చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, ట్రాఫిక్ డైవర్షన్స్ సత్ఫలితాలు ఇచ్చాయని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
ఐటి సెజ్ నుండి కాపుల ఉప్పాడ వరకు ఏర్పాటు చేసిన 59 కంపార్టుమెంట్లలో భద్రత, బందోబస్తు విధులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, డీఐజీ ఫకీరప్ప, బెటాలియన్ ఐజీ బి.రాజకుమారి ఎప్పటికప్పుడు జూన్ 21న ఒంటి గంట నుండే పర్యావేక్షిస్తూ భద్రత, బందోబస్తు విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయుటలో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఐజీ బి.రాజకుమారి, డీఐజీ ఫకీరప్ప, ఎఆర్ ఎస్పీ అశోక్ కుమార్, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, పలువురు డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.