A2Z सभी खबर सभी जिले की

నాటు సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం

- ఎక్సైజ్ సీఐ జనార్దన్ రావు

మెంటాడ,: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవోదయ 2.0 కార్యక్రమంలో భాగంగా సారా రహిత గ్రామాలుగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్ సీఐ జే జనార్దన్ రావు అన్నారు. బుధవారం వానజ గ్రామ సర్పంచ్ కె పైడిపినాయుడు ఆధ్వర్యంలో నవోదయ 2.0 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ జనార్దన్ రావు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ సారా రహిత గ్రామముగా తీర్చిదిద్దడానికి సమిష్టి కృషి అవసరమని తద్వారా విద్యార్థులకు మంచి భవిష్యత్తు తో పాటు పెద్దవారు తాగుడికి బానిస కాకుండా కుటుంబాన్ని చక్కగా చూసుకుంటారని ప్రతి ఒక్కరూ నాటు సారాకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు. అనంతరం వనిజ గ్రామాన్ని సారా రహిత గ్రామముగా డిక్లేర్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కె వెంకట జగదీష్,ఏ.ఓ బాస పంచాయితీ కార్యదర్శి ఎన్ దాలయ్య, వీఆర్వో ఇజ్జరపు అప్పలనాయుడు, ఆర్ గౌరీ, ఎక్సైజ్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Show More
Back to top button
error: Content is protected !!