
విద్యార్థులను అభినందించిన ఇన్‌ఛార్జ్ కలెక్టర్ పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన మెరకముడిదాం మండల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను, ఉపాధ్యాయులను ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ సోమవారం విజయనగరంలోని తమ ఛాంబర్లో అభినందించారు. భవిష్యత్తులో మరింతగా రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
పేదరికం దూరం కావాలంటే చదువే ఏకైక మార్గమని, సన్మార్గంలో నడుచుకుంటూ తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.