
విజయ నగరం జిల్లా ఎస్ కోట నియోజకవర్గం జామి మండలం సిరికి పాలెం పెట్రోల్ బంకు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ మూడు బైకులను డీ కొట్టడంతో బోనీ సాగర్( సిరికి పాలెం), సురేష్ ( భీమిలి) అక్కడిక్కడే మృతి చెందగా మరొకరు విజయ నగరం జిల్లా కేంద్ర ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిసింది. ప్రమాదం తరువాత కారు గోడను డి కొట్టింది.అయితే కారు డ్రైవర్ ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా బయట పడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ….పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది….