A2Z सभी खबर सभी जिले की

*పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యం*

*జనసేన లో 50 కుటుంబాలు చేరిక*

విజయనగరం :
ప్రజాసంక్షేమం, పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యమని
రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి పాలవలస యశస్వి, జనసేన నేత గురాన అయ్యలు అన్నారు
విజయనగరం స్థానిక 06 వ డివిజన్ నుండి సుమారు 50 కుటుంబాలకు చెందిన వాళ్ళు పాలవలస యశస్వి, గురాన అయ్యలు సమక్షంలో 6th డివిజన్ ఇంచార్జ్ దువ్వి రాము అధ్యక్షతన మంగళవారం వైకాపా నుండి జనసేన పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పాలూరి శివ, కోట్ల అప్పలరాజు, పోదులపు సంతోష్, జమ్మూ హరికృష్ణ, పెనుమజ్జి కిషోర్ కుమార్, కోట్ల మోహన్, కెల్లా దిలీప్, కిలారి మోహన్, నడిపేన రాజేష్, పాలూరి కిరణ్ కుమార్, కోరాడ సంతోష్ కుమార్, కెల్లా ఈశ్వర్, కెల్లా భీష్మ, రౌతు రవీంద్ర తదితరులు పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా పాలవలస యశస్వి, గురాన అయ్యలు మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల పట్ల నిబద్ధత, నిజాయితీ, ప్రజాస్వామ్యంపై గౌరవం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో చాలా అరుదన్నారు.ఆయన నాయకత్వంలో పనిచేయడం అదృష్టమన్నారు.
కూటమి ప్రభుత్వ పాలన చాలా బాగుందన్నారు.
అనుభవజ్ఞుడైన సీఎం చంద్రబాబు విజన్‌, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నూతన ఆలోచనలతో ప్రజలు కోరికలు అనుగుణంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.
గత ఐదేళ్లలో ఎన్నో దారుణాలు చూసిన ప్రజలు… నేడు కూటమి ప్రభుత్వం పాలనలో స్వేచ్ఛగా తమ సమస్యలను చెప్పుకుని పరిష్కరించుకోగలుగుతున్నారని అన్నారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అభివృద్ధికి బాటలు పడ్డాయని వెల్లడించారు. ఎన్నడూ లేని విధంగా పంచాయతీరాజ్ శాఖ పని చేస్తోందని, అంతే కాకుండా రాష్ట్రంలో అవినీతి లేకుండా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. రూపాయి లంచం లేకుండా, సిఫార్సులు లేకుండా బదిలీలు జరిగాయని అన్నారు…స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి అందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన జనసేన నేతలు AMC వైస్ చైర్మెన్ శ్రీ బొబ్బాది చంద్రనాయుడు, పీతల లక్ష్మీ, చెల్లూరి ముత్యాలనాయుడు, మోపాడ అనిల్,పతివాడ చంద్రశేఖర్,
డాక్టర్ మురళి మోహన్ గారు,
సైలాడ అనిల్ , ఎంటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Show More
Back to top button
error: Content is protected !!