A2Z सभी खबर सभी जिले की

*కేబినెట్ ప్రక్షాళన జరిగితే మంత్రుల్లో ఎవరెవరిపై వేటు పడొచ్చు???*

ఏపీలో కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వ పనితీరుపై పలు సర్వేలు వెలువడ్డాయి. ఇందులో దాదాపు 40-50 మంది ఎమ్మెల్యేలు తిరిగి గెలవడం కష్టమనే అంచనాలు వచ్చాయి.
అలాగే మంత్రుల పనితీరుపైనా ఇందులో ప్రత్యేక ప్రస్తావనలు వచ్చాయి. పలువురు మంత్రులు సైతం ఈ సర్వేల్లో రెడ్ జోన్ లో కనిపించారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు ఎన్నడూ లేనంతగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

అంచనాలకు తగినట్లుగా పనిచేయని మంత్రులపై వేటు తప్పదనే సంకేతాల్ని సీఎం చంద్రబాబు తాజాగా జరిగిన కేబినెట్ భేటీలోనే ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ప్రక్షాళనకు చంద్రబాబు సిద్దమవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎలాగో జనసేన నుంచి ఎమ్మెల్సీ అయిన నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటామని చెప్పి ఆరునెలలైంది. ఇప్పటికీ ఆయన మంత్రి పదవి కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. దీంతో నాగబాబుతో పాటు పలువురిని తీసుకుని కొందరిని సాగనంపేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ లెక్కన కేబినెట్ ప్రక్షాళన జరిగితే మంత్రుల్లో ఎవరెవరిపై వేటు పడొచ్చు లేదా శాఖల్లో కోత పడొచ్చు, మార్పులు, చేర్పులు జరగొచ్చనే దానిపై టీడీపీకి సన్నిహితంగా ఉంటాడని పేరున్న ప్రముఖ సర్వేయర్ ప్రవీణ్ పుల్లట తన అంచనాల్ని వెల్లడించారు. ఇందులో ఆయన నిర్మొహమాటంగా కేబినెట్ మంత్రుల పేర్లను సైతం ప్రస్తావించారు. ఆయా మంత్రులపై వేటు లేదా మార్పులు చేర్పులు జరగొచ్చని ప్రవీణ్ చేసిన ట్వీట్ ఆయా మంత్రులతో పాటు ఎమ్మెల్యేల్లోనూ, ఆశావహుల్లోనూ తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

Related Articles

Back to top button
error: Content is protected !!