A2Z सभी खबर सभी जिले की

ఎన్టీఆర్ భరోసా అవ్వా తాతలకు వరం

 

ఎన్టీఆర్ భరోసా పథకం అవ్వా తాతలకు వరం లాంటిదని మాజీ పి.ఏ.సి.యస్ అధ్యక్షులు గొర్లెముసలినాయుడు అన్నారు. శనివారం మండల పరిధిలోని అన్ని గ్రామల్లో మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు ఆదేశాల మేరకు మండల ఆగూరు జి.టి.పేట పిట్టాడ తదితర అన్ని గ్రామాల్లో టీడీపీ నాయకులు చేతులు మీదుగా ఫించన్ పంపిణీ చేయడం జరిగింది అని అన్నారు. సీనియర్ నాయకులు గొర్లె ముసలి నాయుడు ఆధ్వర్యంలో పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ జూన్ 1 ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే వృద్దులకు, వికలాంగులకు, వితంతువులకు పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. చంద్రబాబుతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో యం.పి.డి.ఓ భానుమూర్తి యం.పి.టి.సి రెడ్డి ఎర్రి నాయుడు యాసరపు రాము నాయుడు కొల్లు అప్పారావు బుట్టాగౌరినాయుడు కొరిపిల్లి అప్పలరాజు మాజీ హైస్కూల్ విధ్యా కమిటి చైర్మన్ వెన్నెల స్వామి నాయుడు వడ్డీ సతీష్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles
Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!