
మెంటాడ,: న్యూస్: జిల్లా న్యాయస్థానం ఆదేశాల మేరకు సాధారణ సందర్శనలో భాగముగా మెంటాడ మండలం కుంటినవలస గ్రామంలో గల హోప్ కమ్యూనిటీ చిల్డ్రన్ హోమ్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ మరియు అందు సంబంధించిన ఇమ్మానియేల్ గ్రేస్ పబ్లిక్ స్కూల్ గదులను ప్రాంగణము, దత్తిరాజేరు మండలంలో ని బీసీ బాయ్స్ హాస్టల్ ను, బొండపల్లి మండలం గొట్లాం గ్రామంలో గల ఆశ కిరణ్ చిల్డ్రన్ హోమ్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్స్ ను శనివారం గజపతినగరం సివిల్ కోర్ట్ జడ్జి ఎ . విజయ్ రాజ్ కుమార్ సందర్శించారు. హాస్టల్స్ లో గల గదులను, ఆట స్థలాలను , వివిధ ప్రదేశాలను క్రుణంగా పరిశీలించారు. ప్రభుత్వం లేదా సంబంధిత అధికారుల ద్వారా విద్యార్థులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు వారి పట్ల తీసుకునే శ్రద్ధ మొదలగు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఏ విషయంలోనైనా విద్యార్థులకు అసౌకర్యముగా అనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి సమస్య పరిష్కర రీతిగా కృషి చేయాలని విద్యార్థుల హక్కులకు విద్యా స్వేచ్ఛకు ఎటువంటి భంగం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సలహా సూచనలుఇచ్చారు.