
క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సోమవారం విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య పలు ప్రాంతాలలో పర్యటించారు. పైడితల్లమ్మ ఉత్సవం, విజయనగర ఉత్సవాల నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాలలో చేపడుతున్న సుందరీకరణ పనులను ఆయన పరిశీలించారు. కొన్ని లోటుపాట్లను సరిచేసి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. తర్వాత పారిశుద్ధ్య పనులను గమనించారు.
