A2Z सभी खबर सभी जिले की

: “సాహిత్య చరిత్రకారుడికి తగిన గౌరవం లభించాలి” ~భీశెట్టి బాబ్జి*

శాంతి దీక్ష లో పాల్గొన్న ప్రజా సంఘాలు!!_

మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజా చైతన్యం కోసమే అద్భుత రచనలు చేసి ఆధునిక తెలుగు సాహిత్యానికి సరికొత్త రూపం ఇచ్చిన మహాకవి గురజాడ అప్పారావు 163వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహించి ఆమహాకవికి మహోన్నత ఘననివాళులు అర్పించాలని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు.

గురజాడ జయంతి ని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని కోరుతూ బుధవారం జిల్లా పౌర వేదిక,ప్రజా సంఘాల ప్రతినిధులతో కలిసి గురజాడ అప్పారావు విగ్రహం వద్ద శాంతి దీక్ష ను చేపట్టారు,గురజాడ ఇంటి వద్ద ముందుగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు స్వర్గీయ వావిలాల గోపాలకృష్ణయ్య 119 వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులులు అర్పించిన అనంతరం ర్యాలీ గా గురజాడ విగ్రహం వద్దకు చేరుకొని దీక్ష ప్రారంభించారు.

ఈసందర్భంగా భీశెట్టి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్ 689 తేదీ 10-4-2025న ప్రముఖుల జయంతి, వర్ధంతిలను రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు లిస్టు విడుదల చేసిందని అందులో గురజాడ పేరు లేదని, అది చూసి దేశ వ్యాప్తంగా గురజాడ సాహిత్య అభిమానులు, ఉత్తరాంధ్ర ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారని సెప్టెంబర్ 21 ఆదివారం జరిగే గురజాడ 163 వ జయంతి కి ముందే రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చెయ్యాలని కోరుతున్నామని భీశెట్టి అన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, మంత్రి కి వినతిపత్రం అందచేశామని తెలిపారు.

Related Articles

ఈదీక్షలో ప్రముఖ సాహిత్యవేత్త జక్కు రామకృష్ణ,దవడ కొండబాబు,దవడ మీనా, పిడకల ప్రభాకరరావు,గెద్ద చిరంజీవి, జేవివి నాయకులు చీకటి దివాకర్, ఎమ్.వి.ఎన్. వెంకటరావు, డాక్టర్ ఎమ్. వెంకటేశ్వరరావు,ధవళ సర్వేశ్వర్రావు,డాక్టర్ బి.ఏ.రావు,గురజాడ ఇందిర,వెంకటేశ్వర ప్రసాద్, లలితా, త్యాడ రామకృష్ణారావు(బాలు)తుమ్మగంటి రామ్మోహన్ రావు, ఈశ్వర ప్రసాద్,మమ్ముల తిరుపతి రావు,కనకాచారి, తదితరులు పాల్గొన్నారు.

Show More
Back to top button
error: Content is protected !!