
విజయనగరంలో శుక్రవారం శ్రీ పైడితల్లి అమ్మవారి పందిరిరాట మహోత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారి చదురగుడి వద్ద ముహూర్త సమయానికి పందిరిరాట వేయగా, రైల్వే స్టేషన్ సమీపంలోని వనంగుడి వద్ద కూడా ఈ మహోత్సవాన్ని నిర్వహించారు. దీంతో అమ్మవారి సినిమా సంబరాలకు శ్రీకారం చుట్టినట్లయింది. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఆలయ అధికారులు, పూజారులు, భక్తులు పాల్గొన్నారు.
