A2Z सभी खबर सभी जिले की

గంజాయి కేసుల్లో దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలి

*- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్*

జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో ఎన్.డి.పి.ఎస్. చట్టం ప్రకారం నమోదై, దర్యాప్తులో ఉన్న గంజాయి కేసులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ సెప్టెంబరు 2న సమీక్షించారు. జిల్లాలో పని చేస్తున్న పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ జూమ్ కాన్ఫరెన్సు నిర్వహించి, వివిధ పోలీసు స్టేషనుల్లో దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతిని అడిగి తెలుసుకొని, కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులకు దిశా నిర్ధేశం చేసారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో ఎన్.డి.పి.ఎస్.
చట్టం ప్రకారం నమోదై, దర్యాప్తులో ఉన్న కేసులను సమీక్షించి, ఆయా కేసుల్లో దర్యాప్తు పెండింగులో ఉండుటకు గల
కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తులో ఉన్న గంజాయి కేసుల్లో ఇంత వరకు అధికారులు చేపట్టిన దర్యాప్తు, కేసుల పురోగతిని ఒక్కొక్కటిగా పరిశీలించారు. అరెస్టులు పెండింగులో ఉన్న కేసుల్లో నిందితులను వెంటనే అరెస్టు చేయాలన్నారు. పరారీలో ఉన్న నిందితుల గురించి సమాచారం సేకరించాలని, వారి ఆచూకీని గుర్తించేందుకు సాంకేతికతను వినియోగించాలని, ప్రెసిడెన్సీ పాస్పోర్టు తీసుకొని, ఇతర రాష్ట్రాలకు పోలీసు బృందాలను పంపాలని అధికారులను ఆదేశించారు. దర్యాప్తులో ఉన్న గంజాయి కేసుల్లో ఇన్వెంటరీ పూర్తి చేయాలని, నిబంధనలకు
అనుగుణంగా వ్యవహరించాలన్నారు. తరుచూ ఇదే తరహా నేరాల్లో అరెస్టు అవుతున్న నిందితులపై హిస్టరీ షీట్లును ప్రారంభించి, వారి కదలికలపై నిఘా పెట్టాలన్నారు. నిందితులు ఇతర ప్రాంతాలకు చెందిన వారైతే వారి హిస్టరీ షీట్లును సంబంధిత పోలీసు స్టేషన్లుకు బదిలీ చేయాలన్నారు. పిట్ ఎన్.డి.పి.ఎస్.కు అనుకూలంగా ఉన్న కేసుల్లో అనుమతులు
పొంది నిందితులను ముందస్తు అరెస్టు చేయాలన్నారు. గంజాయి వ్యాపారంతో అక్రమంగా సంపాదించిన ఆస్తులను గుర్తించి, వారిపై ఫైనాన్సియల్ ఇన్విస్టిగేషను పూర్తి చేసి, వారి అక్రమ ఆస్తులను అటాచ్ చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. గంజాయితో పట్టుబడిన కేసుల్లో గంజాయి రవాణాకు పాల్పడిన వ్యక్తులతోపాటు, వారికి గంజాయిని సరఫరా చేసిన వ్యక్తులు, విక్రయించిన వ్యక్తులను, ఇతర ప్రధాన నిందితులను కూడా ఆయా కేసుల్లో నిందితులుగా
చేర్చాలన్నారు. గంజాయి కేసుల్లో అర్హులైన నిందితలపై పి.డి.యాక్టు ప్రయోగించేందుకు ప్రతిపాదనలు పంపాలని అధికారులను అదేశించారు. నాన్ బెయిలబుల్ వారంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వాటిని ఎగ్జిక్యూట్ చేసేందుకు సిబ్బందిని నియమించాలన్నారు. రాబోయే లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు డిస్పోజ్ అయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. దర్యాప్తు పెండింగులో ఉన్న గంజాయి కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసి, నిందితులపై అభియోగ పత్రాలను దాఖలు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.
ఈ జూమ్ కాన్ఫరెస్సులో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్పీ జి.భవ్య రెడ్డి, చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు, పలువురు సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

Related Articles
Back to top button
error: Content is protected !!