
*🔸విజయనగరం జిల్లా చిరంజీవి యువత & జనసేన సేవాదళ్ సంయుక్త ఆధ్వర్యంలో..*
🔸జనసేన కార్పొరేట్ అభ్యర్థులకు సన్మానం చేసిన జనసేన బాలు
జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా మంగళవారం ఉదయం విజయనగరం జిల్లా చిరంజీవి యువత మరియు జనసేన సేవాదళ్ సంయుక్త ఆధ్వర్యంలో జనసేన పారీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) నిర్వహించారు.
ముందుగా ముఖ్య అతధిగా విచ్చేసిన పార్టీ సీనియర్ నాయకులు గురాన అయ్యలు కేక్ ను కట్ చేసి వేడుకలను ప్రారంభించారు.
అనంతరం అప్పటి కార్పొరేట్ అభ్యర్థులైన వీరామహిళ మాతాగాయత్రీ, జనసేన యువనాయకులు లోపింటి కళ్యాణ్, హుస్సేన్ ఖాన్, ఎంటి రాజేష్, వంక నరసింగరావు ను ఘనంగా సత్కరించారు.
ఈసందర్భంగా అయన మాట్లాడుతూ 2019లో..అధికారంలో లేనప్పుడు, కళ్యాణ్ బాబుపై వీరాభిమానులుగా, నమ్మకంతో ధైర్యం చెప్పి..నడిపించే నాయకులు లేకపోయినా.. అప్పటి మన ప్రతిపక్ష పార్టీలలో.. హేమహేమీ నాయకులు వున్నా.., వారికి భయపడకుండా కార్పొరేట్ అభ్యర్దిలుగా వారు నిల్చున్న ధైర్యసాహసాలు వెలకట్టలేని వని, 2019లో..జనసైనికుల, వీరమహిళలు సేవలను కొనియాడుతూ ఇటువంటి కార్యక్రమాన్ని చేసిన జనసేన నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు)ను అభినందించారు.
అనంతరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు (బాలు)మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఆశయాలకు కట్టుబడి జిల్లా చిరంజీవి యువత, జనసేన సేవాదళ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టామని, రాష్ట్ర తూర్పుకావు కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి పాలవలస యశస్వి, జనసేన యువనాయకులు గురాన అయ్యలు,అవనాపు విక్రమ్ బాబు ఆశీస్సులలతో కళ్యాణ్ బాబు పుట్టినరోజు వారోత్సవాలు నిర్వహించామని, కళ్యాణ్ బాబు ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జనసైనికులు, వీరమహిళలు, శ్రీ సాయికృష్ణా వాకర్స్ క్లబ్ పెద్దలు భారీగా పాల్గున్నారు.