A2Z सभी खबर सभी जिले की

*విద్యుత్ స్మార్ట్ మీటర్లను పగలకొట్టండని పిలుపిచ్చిన లోకేష్ బాబు గారు నోరు మూగబోయిందా…?*

*వామపక్ష, ప్రజాసంఘాల ఐక్యవేదిక నేతలు బుగత అశోక్, తమ్మినేని సూర్యనారాయణ ల ఆగ్రహం.*

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను విద్యుత్ చార్జీలు, అదానీ స్మార్ట్ మీటర్లుతో నిలువు దోపిడి చేస్తున్న చంద్రబాబు నాయకత్వంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ, సిపిఎం వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ప్రజా వేదిక నేతృత్వంలో దశల వారి పోరాటాలు నిర్వహిస్తామని
సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ లు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం ఉదయం విజయనగరం కలక్టర్ కార్యాలయం వెనుక ఉన్న విద్యుత్తు సబ్ స్టేషన్ దగ్గర నిరసన ధర్నా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాలో మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం తొమ్మిది సార్లు కరెంటు చార్జీలు పెంచి రూ32 వేల కోట్ల భారం ప్రజలపై మోపిందని ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండి బాదుడే బాదుడు అనే కార్యక్రమాలు చేసి టీడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చార్జీలు పెంచబోమని ఇప్పటికే భారంగా ఉన్న చార్జీలు తగ్గిస్తామని ఎన్నికల ప్రణాళికల హామీలు ఇచ్చి నేడు ఆ హామీని విస్మరించడం ఒడ్డు చేరాక తెప్ప తగలేసి చందాన ఉందని విమర్శించారు. స్మార్ట్ మీటర్లు పగలగొట్టండని చంద్రబాబు సుపుత్రుడు లోకేష్ బాబు ఆనాడు పిలిపిచ్చారని నేడు అదే స్మార్ట్ మీటర్లు ఇంటింటికి వచ్చి బోగిస్తుంటే లోకేష్ బాబు నోరు మెదపకుండా ప్రజలను నమ్మకద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలను దోచుకోవడానికి పాలకులు పూనుకుంటున్నారని ఆదాని కంపెనీ రాష్ట్రంలోని రెండు కోట్ల మంది వినియోగదారులకు పాత మీటర్లు తొలగించి కొత్త స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని ఇది మీటర్ మార్పు మాత్రమే కాదు అని విద్యుత్ పంపిణీ ప్రైవేటుకరణకు, కార్పొరేట్లకు కట్టబెట్టడానికి చేస్తున్న కుట్రలో భాగమని పేర్కొన్నారు. ఈ మీటర్ ఖర్చు సింగల్ ఫేస్ కు 9000 త్రీ ఫేస్ కి 17,000 93 నెలల్లో వాయిదాల పద్ధతిలో జనం నుండే వసూలు చేస్తారని తర్వాత మళ్లీ మీటర్ మార్చుకోవాల్సిందే మళ్లీ డబ్బు కట్టాల్సిందే గంట గంటకు రీడింగ్ తీస్తారని పగల కంటే రాత్రి వాడి కరెంటుకు అధిక బిల్లులు వేస్తారని వేసవికాలంలో ఎక్కువ రేట్లు వసూలు చేస్తారని తెలిపారు. ఈ స్మార్ట్ మీటర్లతో ప్రజలతో ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేయడమే అని మండిపడ్డారు. అదాని స్మార్ట్ మీటర్లు రద్దు చేసే వరకు, ఇప్పటికే బిగించిన మీటర్లును తొలగించే వరకు, ట్రూ ఆఫ్ చార్జీలు విధానాన్ని తొలగించే వరకు, అదనపు భారాలు తగ్గించేవరకు, సెఖీ ఒప్పందాలు రద్దు చేసే వరకు ఈ దశల వారి పోరాటం చేస్తామని తెలిపారు. ఈ పోరాటంలో ప్రజలందరూ సహకరించి ప్రత్యక్ష భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు ఎస్ రంగరాజు, ఆంధ్రపదేశ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు బాయి రమణమ్మ, ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బూర వాసు, సిపిఎం డివిజన్ కార్యదర్శి రెడ్డి శంకరరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి పి. రమణమ్మ, సిఐటీయు పట్టణ కార్యదర్శి బి. రమణ, ఎస్. ఎఫ్. ఐ జిల్లా కార్యదర్శి రాము ప్రజా సంఘాలు సంఘాల నాయకులు మరియు సిపిఐ, సిపిఎం సభ్యులు పాల్గొన్నారు.

Back to top button
error: Content is protected !!