
🌀 *అనారోగ్యంతో మృతి చెందిన హెడ్ కానిస్టేబులు కుటుంబానికి ‘చేయూత’గా రూ.1,48,600/- ల చెక్ ను అందజేసిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్*
🌀 *పోలీసు కుటుంబ సంక్షేమానికి కృషి చేస్తామన్న జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్*
విజయనగరం జిల్లా పోలీసుశాఖలో ఆర్మ్ డ్ రిజర్వు విభాగంలో హెడ్ కానిస్టేబులుగా పని చేసి, ఇటీవల అనారోగ్య కారణంతో మృతి చెందిన నర్సింహ పట్నాయక్ కుటుంబానికి ‘చేయూత’ను అందించేందుకు జిల్లా పోలీసుశాఖలో పని చేసే పోలీసు అధికారులు, సిబ్బంది అందించిన రూ.1,48,600/-ల చెకన్ను అతని సతీమణి శ్రీమతి స్వర్ణలత పట్నాయక్ గార్కి జిల్లా ఎస్పీవకుల్ జిందల్, ఐపిఎస్ ఆగస్టు 5న జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేసారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – పోలీసుశాఖలో పని చేస్తూ ప్రమాదవసాత్తు
లేదా అనారోగ్యంతో మరణించిన పోలీసు కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకొనేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చి, కొంత నగదును ప్రోగు చేసి, వారి కుటుంబాలకు “చేయూత” గా అందజేయడం అభినందనీయమన్నారు. ఈ తరహా చర్యలు చేపట్టడం వలన పోలీసు ఉద్యోగుల్లో ఐకమత్యం పెరగడంతోపాటు, వారి కుటుంబాలకు అండగా ఉన్నామన్న భరోసా లభిస్తుందని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎఓ పి.శ్రీనివాసరావు, ఆఫీసు సూపరింటెండెంట్ టి.రామకృష్ణ మరియు పోలీసు కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.