
బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యం లో ఈ ఆగస్టు 3 తేదీ నాడు విజయనగరం లోని సోమస్కంద పీఠం, జ్ఞాన సరస్వతి దేవాలయం లో `నగర అర్చకుల సమావేశం`ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 02:30 గంటల నుండి సాయంత్రం 06:30 గంటలవరకు విజయనగరం లోని దేవాలయాల అర్చకులందరి ఆత్మీయ కలయిక ఉంటుంది. ముక్యంగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక నిర్వహిస్తున్న వేడుకల విషయాలు, అందచేస్తున్న పథకాలను వారందరికీ వివరించడం జరుగుతుంది.విజయనగరం లోని దేవాలయాల అర్చకులు పురోహితులు ప్రత్యేకంగా గూగుల్ ఫార్మేట్ అప్లికేషన్ ఈ నెల 01 నుంచి 28వ తేదీ లోగా ఫిలప్ చెయ్యాలని గ్రూపులో దీన్ని పొందుపరిచామని వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ఇంచార్జ్ తెలియజేయడం జరిగింది . అంతేకాకుండా ఈ వేడుక కు పురోహితులు అర్చకులు తప్పకుండ విచ్చేయాలని తెలియజేశారు. ఇంతకుముందు విశాఖపట్నం విజయవాడ హైదరాబాదులో ఈ కార్యక్రమాల నిర్వహించడం జరిగాయి అదే కాకుండా ఇప్పుడు విజయనగరంలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతున్నదని బాల శ్రీనివాసులు
వ్యవస్థాపక కార్యదర్శి
బ్రాహ్మణ సంక్షేమ వేదిక మరియు
ఏలూరు వెంకట మూర్తి శర్మ విజయనగరం కోఆర్డినేటర్ సూర్య ప్రకాష్ విజయనగరం జోనల్ ఇంచార్జ్ మరియు ఇతర సభ్యులు