A2Z सभी खबर सभी जिले की

రెండున్నర తులాల బంగారు పుస్తుల త్రాడు బాధితురాలికి అప్పగింత

*- విజయనగరం వన్ టౌన్ సిఐ ఆర్.వి.ఆర్.కె.చౌదరి*

పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లిఫిర్యాది మండలం రావుపల్లి గ్రామానికి చెందిన పల్లెం లక్ష్మి తన కుమార్తెను చూసేందుకు జూలై 23న విజయనగరం విచ్చేసినారు. అనంతరం, తన కుమార్తె ఇంటికి వెళ్లేందుకు గాను ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆటో ఎక్కి, ఆర్ అండ్ బి గెస్టు హౌస్ వద్ద దిగిపోయారు. ఆమె ఆటోలో బ్యాగు మర్చిపోయినట్లుగా తరువాత గుర్తించి, వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వన్ టౌన్ సిఐ ఆర్.వి.ఆర్.కే.చౌదరి ఆదేశాలతో టౌన్ క్రైమ్ ఎస్సై సురేంద్ర నాయుడు మరియు సిబ్బంది ఆటోను ట్రేస్ చేసేందుకు చర్యలు చేపట్టారు.
పోలీసుల చర్యలు ఫలితంగా ఆటోను ట్రేస్ చేయగా, ఆటోలో బ్యాగు లభించింది. అనంతరం, బ్యాగును అందులోగల రెండున్నర తులాల నల్ల పూసల త్రాడు, రూ.1300/- ల నగదు, బ్యాగును వన్ టౌన్ సిఐ ఆర్.వి.ఆర్.కే.చౌదరి బాధితురాలైన పల్లెం లక్ష్మీకి వన్ టౌన్ పోలీసు స్టేషన్లో అప్పగించారు. ఆటో డ్రైవర్ కూడా ఆటో వెనుక ఉన్న బ్యాగును గుర్తించలేనట్లుగా పోలీసులు తెలిపారు. ఆటోను ట్రేస్ చేసి బ్యాగును, విలువైన బంగారు నల్లపూసల త్రాడు, నగదును అప్పగించుటలో క్రియాశీలకంగా పని చేసిన ఎస్సై సురేంద్ర నాయుడు, సిబ్బందిని సిఐ ఆర్.వి.ఆర్.కే. చౌదరి అభినందించారు.

Check Also
Close
Back to top button
error: Content is protected !!