A2Z सभी खबर सभी जिले की

30కిలోల గంజాయితో ముగ్గురు నిందితులు అరెస్టు

*- విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు*

విజయనగరం పట్టణం రైల్వే స్టేషను రోడ్డులోని ఎం.ఆర్.లాడ్జి ఎదురుగా ముగ్గురు వ్యక్తులు ట్రాలీ సూట్కేసులను త్రోసుకొంటూ వస్తుండగా విజయనగరం 1వ పట్టణ పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి 30కిలోల గంజాయిని సీజ్ చేసినట్లుగా 1వ పట్టణ పోలీసు స్టేషనులో నిర్వహించిన మీడియా సమావేశంలో డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు వివరాలను జూలై 23న వెల్లడించారు.
ఈ సందర్భంగా విజయనగరం డిఎస్పీ ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ – జూలై 22న విజయనగరం 1వ పట్టణ పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో రైల్వే స్టేషను రోడ్డులో మాటువేసి ఉండగా, ముగ్గురు వ్యక్తులు
రెండు ట్రాలీ సూట్కేసులను త్రోసుకొంటూ రైల్వే స్టేషను రోడ్డులోని ఎం.ఆర్.లాడ్జ్ ఎదురుగా వచ్చేసరికి, అనుమానంతో 1వ పట్టణ పోలీసులు సోదాలు చేయగా ఒక ట్రాలీ సూట్ కేసులో 13కిలోలు, మరో సూట్ కేసులో 17కిలోల
గంజాయి, నాలుగు ఆండ్రాయిడ్ ఫోన్లు, రెండు కీ ప్యాడ్ ఫోన్లు, రూ.4000/-ల నగదు లభించిందన్నారు. విచారణలో పట్టుబడిన నిందితులు (ఎ-1) ఒడిస్సా రాష్ట్రం కలహండి జిల్లా ఉచ్చల గ్రామంకు చెందిన పితాంబర్ నాగ్ (42సం.లు) (ఎ-2) ఒడిస్సా రాష్ట్రం కలహండి జిల్లా బిరుమల గ్రామానికి చెందిన చంద్ర కరున్ (35 సం.లు) (ఎ-3) ఒడిస్సా రాష్ట్రం కలహండి జిల్లా చార్ బహల్ గ్రామానికి చెందిన ప్రదీప్ నాయక్ (40 సం.లు) అనే వ్యక్తులుగా గుర్తించామన్నారు. ఎ-1 పితాంబర్ నాగ్ పై ఇప్పటికే పలు గంజాయి కేసులు ఉన్నాయన్నారు. గంజాయి వ్యాపారం చేసే క్రమంలో ఎ-2 చంద్ర కరున్, ఎ-3 ప్రదీప్ నాయక్ లతో పరిచయం ఏర్పడిందని, గంజాయి అక్రమ రవాణ తరలింపులో ఎ-1 పితాంబర నాగ్ కు సహాయపడుతూ ఉంటారని, ఇందుకు ప్రతిగా ఒక ట్రిప్కు రూ.5 వేలు చొప్పున చెల్లించినట్లుగా
విచారణలో వెల్లడైందన్నారు. ఎ-1 పితాంబర్ ఒడిస్సా రాష్ట్రం భవానీపట్నంకు చెందిన (ఎ-4) జయదర్ అలియాస్
తామోతర్ అనే వ్యక్తి వద్ద నుండి కిలో రూ.5వేలు చొప్పున 30కిలోల గంజాయిని రూ. 1.50లక్షలకు కొనుగోలు చేసారన్నారు. జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారి ఆదేశాలతో ఎ-4 జయదర్ అలియాస్ తామోతర్ను కూడా
అరెస్టు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.
ఈ కేసులో నిందితులను అరెస్టు చేసి, గంజాయిని సీజ్ చేయుటలో క్రియాశీలకంగా పని చేసిన 1వ పట్టణ
సిఐ ఆర్.వి.ఆర్.కే. చౌదరి, టాస్క్ ఫోర్సు సిఐ డి.బంగారుపాప, ఎస్ఐలు రామ గణేష్, ఎఎస్ఐ ఎన్.రామలక్ష్మి,
కానిస్టేబుళ్ళు ఎన్.గౌరీ శంకర్, బి.శ్రీనులను డిఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. త్వరలో వీరికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేయనున్నామని డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.

Back to top button
error: Content is protected !!