
విజయనగరం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ – హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ లో జనసేన నాయకులు అవనాపు విక్రమ్*
*మెగా బైక్ ర్యాలీని విజయవంతం చేసిన జనసైనికులు, మెగా అభిమానులకు కృతజ్ఞతాభివందనాలు తెలిపిన జనసేన నాయకులు అవనాపు విక్రమ్*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పవర్ స్టార్ శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల నేపథ్యంలో విజయనగరం పట్టణంలో జనసేన నాయకులు అవనాపు విక్రమ్ గారి ఆధ్వర్యంలో మెగా బైక్ ర్యాలీ జరిగింది. ఈ నెల 24వ తేదీన విడుదల కానున్న హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆకాంక్షిస్తూ ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా బుధవారం విజయనగరం పట్టణంలో నిర్వహించిన మెగా బైక్ ర్యాలీ కి జనసేన నాయకులు అవనాపు విక్రమ్ గారు నాయకత్వం వహిస్తూ, తాను స్వయంగా బైక్ నడుపుతూ, జనసేన శ్రేణులను ఉత్సాహపరుస్తూ, బాలాజీ నగర్ లోని జనసేన కార్యాలయం నుండి ర్యాలీ ప్రారంభమైంది. ముందుగా హరిహర వీరమల్లు సినిమా ప్రదర్శించనున్న ప్రధాన థియేటర్ హిమగిరి ధియేటర్ మీదగా ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్, పిడబ్ల్యూటి మార్కెట్, ఎస్ బి ఐ మెయిన్ బ్రాంచ్, కన్యకా పరమేశ్వరి ఆలయం, గంట స్తంభం, మూడు లాంతర్లు, కోట జంక్షన్, సింహాచలం మేడ, అంబేద్కర్ జంక్షన్ ల మీదగా హిమగిరి థియేటర్ వరకు ఈ మెగా బైక్ ర్యాలీ సాగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీర మల్లు సినిమా ప్రమోషన్ కోసం నిర్వహించిన మెగా బైక్ ర్యాలీలో వేలాది మంది జనసైనికులు, పవన్ అభిమానులు, వీర మహిళలు, మెగా ఫ్యామిలీ అభిమానులు పాల్గొన్నారు. అనంతరం శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద పూజలు నిర్వహించారు. అంతకుముందు మెగా బైక్ ర్యాలీ నిర్వహించిన జనసేన నాయకులు అవనాపు విక్రమ్ గారు మీడియాతో మాట్లాడుతూ భారత దేశ చరిత్రలో భాగమైన కొన్ని అంశాలను కధా వస్తువులగా తీసుకొని తీర్చి దిద్దిన సినిమా హరిహర వీరమల్లు అని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమని ఉప ముఖ్యమంత్రి వర్యులుగా బాధ్యతలు చేపట్టిన తరువాత విడుదలవుతున్న హరిహర వీరమల్లు సినిమా అభిమానులకు కనువిందు చేయబోతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ తన ఉన్నతికి కారణమైన సినిమా రంగానికి కూడా తగు ప్రాధాన్యతను ఇస్తున్న గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భంగా అవనాపు విక్రమ్ గారు అన్నారు. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ లో భాగమైన మెగా ఫ్యామిలీ అభిమానులకు, జనసేన నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయనగరం నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు మరియు పవర్ స్టార్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.