
మెంటాడ: న్యూస్: మానవసేవయే మాధవ సేవ అనే నినాదంతో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అభాగ్యులను ఆదుకుంటూ అనాధలకు అభయ హస్తం అందిస్తూ సామాజిక సేవలో నేనున్నాను అంటూ ముందుంటున్న మాతృభూమి సేవా సంఘం మరొక్కసారి తమ సంస్థ ఉద్దేశాన్ని, మానవత్వాన్ని నిర్వర్తించింది. మండలంలో గల పెద్ద మేడపల్లి గ్రామానికి చెందిన కలగట్ల విజయ్ బ్రతుకుతెరువు కోసం విశాఖపట్నంలో కూలి పనులు చేస్తుండగా దురదృష్టవశాత్తు మెదడులోని రక్త శ్రావం వలన పక్షవాతం రావడంతో ఆర్థిక పరిస్థితుల వలన సమయానికి వైద్యం చేసుకోకపోవడం వలన వ్యాధి తీవ్రతను బట్టి పలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా మాతృభూమి సేవా సంఘం మెంటాడ మండల ఇంచార్జ్ సిరిపురం జగదీష్ (ప్రసాద్) స్పందించి తమ సంస్థ తరపున బాధితులకి పది వేలు (10,000) ఆర్థిక సహాయాన్ని మానవతా దృక్పథంతో పెదమేడపల్లి రెడ్డి ఎర్రినాయుడు చేతులు మీదగా బాధితునికి అందించారు. అనంతరం గ్రామంలో గల యూత్ అండ్ ఎంప్లాయిస్ లను మరియు గ్రామస్తులను ఉత్తేజపరిచి పలు విరాళాలను సేకరించి బాధితునికి అందించి వైద్య సహకార నికి తోడ్పడ్డారు. ఈ సందర్భంగా మండల ఇంచార్జ్ జగదీష్ మాట్లాడుతూ ప్రతి యువకుడు, ప్రతి ఉద్యోగి, మానవత్వం కలిగిన ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఆపదలో ఆదుకోవాలనే పెద్ద మనసు ఉంటే ఆర్థిక వెనుకబాటు బాధితులను, ఇటువంటి పేదవారిని ఆదుకోగలమని వారికి సరైన వైద్య సహాయం సకాలంలో అందించగలమని అందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మాతృభూమి సేవ సంఘం ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మనలను పొందడమే కాకుండా మానవత్వాన్ని చూపిస్తుందని తెలిపారు. ఆర్థిక సహాయము అందించిన గ్రామస్తులకు, మాతృభూమి సేవా సంఘం ప్రతినిధులకు రెడ్డి ఎర్నాయుడుకు బాధితుని సోదరుడు కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వాళ్లే వెంకటరమణ, వడ్డీ ఇస్సాకు, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.