A2Z सभी खबर सभी जिले की

పర్యావరణ పరిరక్షణ భవిష్యత్ తరాలకు మనం అందించే ప్రాణ వాయువు… యం.పి.పి రెడ్డి సన్యాసి నాయుడు

 

ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ఈరోజు మెంటాడ మండలం లోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటిన యం.పి.పి రెడ్డి సన్యాసి నాయుడు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అడవులను కాపాడుకోవాలి, జలవనరులను సంరక్షించుకోవడం మన కర్తవ్యం. అందుకే ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది, దీనిలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు.మండలతెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి మన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ముందుకు వెళ్దాం పర్యావరణ పరిరక్షణ కు మన అందరం కలిసి పని చేద్దాం అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో యం.ఆర్.ఓ కోరాడ శ్రీనివాసరావు ఇ.ఓ.పి.ఆర్.డి విమల కుమారి మెంటాడ వైద్య అధికారిని జి.కల్పన సీనియర్ అసిస్టెంట్ శర్మ జూనియర్ అసిస్టెంట్ సంతోష్ మండల పరిషత్ సిబ్బంది ఉపాధి హామీ టీసీలు టిడిపి కార్యకర్తలు నాయకులు, మరియు మండల అధికారులు పాల్గొన్నారు.

 

Related Articles
Show More
Check Also
Close
Back to top button