
రక్త దాతలు ముందుకురండి
~రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్
కె.ఆర్.డి. ప్రసాద్ రావు
—————————–
విజయనగరం, శుక్రవారం, మే 30:
ప్రస్తుతం కళాశాలలు వేసవి సెలవలు కావడంతో విద్యార్థులు అందుబాటులో లేకపోవడం వలన, ఈ మధ్యానంతా వేసవి ఉష్నోగ్రతలు ఎక్కవగా ఉండటంతో రక్తదానం చేయుటకు దాతలు కొంతమేరా తగ్గారని, రక్త సేకరణలో కళాశాల విద్యార్థుల పాత్ర గణనీయమని, కళాశాలలు తెరుచుకొనుటకు వ్యవధి ఉన్నందున,వాతావరణం కూడా చల్లబడటంతో రక్త నిల్వలో కొరత భర్తీచేయుటకు యువత, స్వచ్ఛంద సంస్థలు, మరియు రెడ్ క్రాస్ శాశ్వత సభ్యులందరూ రక్తదానం చేయడానికి, చేయుంచుటకు ముందుకురావాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కె.ఆర్.డి. ప్రసాదరావు శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు.
కె.ఆర్.డి. ప్రసాదరావు,
చైర్మన్,
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ,
విజయనగరం జిల్లా శాఖ.