
ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అభినందించారు. ఈనెల 4వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బీహార్‌లో జరిగిన 7వ ఖేలో ఇండియా కబడ్డీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జుట్టు 3వ స్థానం సాధించింది. ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించేందుకు కీలక పాత్ర పోషించిన విజయనగరానికి చెందిన క్రీడాకారులు ఎం.రాంబాబు, కే.యశ్వంత్‌తో పాటు వారి కోచ్‌లను ఎమ్మెల్యే ఆదివారం సత్కరించారు.