
మెంటాడ, : లెప్రా సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మండలంలో కుష్టి వ్యాధి బాధితులకు అనేక సేవలు చేస్తుందని లెప్రా సొసైటీ చేస్తున్న సేవలు అభినందనీయమని ఎంపీడీవో భానుమూర్తి అన్నారు. గురువారం మండల కార్యాలయంలో లెప్రా సొసైటీ మండల ఆర్గనైజర్ లెంక రమణ ఆధ్వర్యంలో ఎంపీడీవో భానుమూర్తి చేతుల మీదుగా చల్లపేట, జక్కువ గ్రామాలలో గల కుష్టు వ్యాధి, ఫైలేరియా బాధితులకు పాదరక్షకులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ స్వయం సంరక్షణతోనే అంగవైకల్యం నిర్మూలించవచ్చని ప్రభుత్వంతో కలిసి లెప్రా సొసైటీ చేస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం లెంక రమణ మాట్లాడుతూ లెఫ్రా సొసైటీ జిల్లా ప్రభుత్వ మహారాజ ఆస్పత్రిలో గల జిల్లా కుష్టి నివారణ అధికారి సహకారంతో కుష్టు వ్యాధి బాధితులకు అంగవైకల్యం నివారణకై రిఫరల్ సెంటర్ ద్వారా సేవలు అందించటం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగా కుష్టి వ్యాధి బాధితులకు ఉచితంగా ప్రత్యేక పాదరక్షకులు అందిస్తున్నామని పిజియో సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. లేప్రా సొసైటీ చేస్తున్న సేవలకు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లేప్రా సొసైటీ సిబ్బంది, బాధితులు పాల్గొన్నారు.