
2025-26కుగాను ప్రైమరీ స్కూళ్ల అకడమిక్ క్యాలెండర్ సిద్ధం అవుతున్నట్లు విద్యాశాఖ వర్గాల సమాచారం. మొత్తంగా 233 వర్కింగ్ డేస్, 83 హాలిడేస్ ఉండనున్నాయి. జనరల్ స్కూళ్లకు SEP 24 నుంచి OCT 2 వరకు దసరా, JAN 10 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. క్రిస్టియన్ మైనార్టీ స్కూళ్లకు DEC 21 నుంచి 28 వరకు క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయని ఆ వర్గాలు చెప్పాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.