
కమ్యూనిటీ హెల్త్ సిబ్బంది సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీ జేఏసీ మండల అధ్యక్షుడు దుర్గారావు ఆదివారం డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులగా సమస్యలపై పోరాడుతున్నారని, ప్రభుత్వం చర్చలకు పిలవాలని కోరారు. గ్రామాల్లో కమ్యూనిటీ హెల్త్ సిబ్బంది కీలకంగా విధులు నిర్వర్తిస్తున్నారన్నారు.
జీతాలు పెంచాలని, అద్దె భవనాలకు బకాయిలు చెల్లించాలని కోరారు.