A2Z सभी खबर सभी जिले की

ఢిల్లీలో ఉన్న ఆంధ్రా భవనంలో జిందాల్ నిర్వాసితులు ఆందోళన

జిందాల్ నిర్వాసితులు ఢిల్లీలో ఉన్న ఆంధ్రా భవనం వద్ద అంబేద్కర్ విగ్రహం కూడలిలో ఆందోళన నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు గానీ ప్రజా ప్రతినిధులు గాని, అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్సీ రఘురాజు ఆధ్వర్యంలో ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ , మరియు విజయనగరం జిల్లా నుంచి వెళ్లిన సుమారు 100 మంది నిర్వాసితులు ఢిల్లీలో మూడో రోజు అయిన లక్ష్మివారం కూడా నిరసనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రఘురాజు మాట్లాడుతూ గత 84రోజులుగా సర్వం కోల్పోయిన జిందాల్ బాదితులు “మా భూమి వెనకకు ఇచ్చి” ఆదుకోవాలని పెద్ద ఎత్తున ఆందోళన నినదించారు ఇప్పటికే జంతర్ తర్వాత ధర్నా నిర్వహించామని, నేషనల్ హోమం రైట్స్ చైర్మన్ వంటి వారికి మా సమస్యలు తెలియజేశామని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల గాని జిల్లా నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు గాని దళిత గిరిజన నిర్వాసితులను కన్నెత్తి కూడా చూడడం లేదన్నారు జిందాల్ యాజమాన్యానికి అందరూ అనుకూలంగా మారడంతో తమ గోడు వినిపించేందుకు దేశ రాజధాని ఢిల్లీకి రావలసి వచ్చింది అన్నారు , జిల్లాలో ఉన్న అధికారులు పోలీసులు నిర్వాసితుల నిర్బంధించి కనీసం నిరసన చేయడానికి కూడా అనుమతించకపోవడం అన్యాయం అన్నారు కంపెనీ కట్టి ఉద్యోగాలు వస్తే ఈ ప్రాంతం బాగుంటుందని ఆలోచించి అయస్టంగానే భూములు ఇచ్చారని 18 ఏళ్లయిన కంపెనీ కట్టకపోవడంతో వెంటనే పేదల భూములు పేదలకు ఇవ్వాలని రఘురాజు డిమాండ్ చేశారు
ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ మాట్లాడుతూ కంపెనీ పేరుతో పేదల వద్ద ఉన్న ఢీ పట్టా భూములు మొత్తం దోచుకొని నిర్వాసితులకు అన్యాయం చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ధారుణం అన్నారు భూములు తీసుకున్నప్పుడు ఆ భూముల్లో కంపెనీ కట్టి మీకు ఉపాధి కల్పిస్తాం, అందరికీ ఉద్యోగాలు ఇస్తాం, భూమి విలువకు సరిసమానమైన షేర్లు రూపంలో వాటా ఇస్తాం అని చెప్తేనే పేదలందరూ భూములు ఇచ్చేందుకు సిద్ధపడ్డారని కానీ నేడు నిర్వాసితులను పక్కనపెట్టి ప్రభుత్వ పెద్దలతో జిందాల్ యాజమాన్యం అవగాహన కల్పించుకొని పారిశ్రామిక రియల్ ఎస్టేట్ కు తెగబడతుంది అన్నారు తోచని స్థితిలో మూడు నెలలుగా ఆందోళన నిర్వహిస్తున్న అందరూ ఒక్కటై దళిత దళిత గిరిజనులకు మోసం చేయడం సరికాదు అన్నారు నిర్వాసితుల భూమి నిర్వాసితులకు ఇచ్చేవరకు ఆందోళన తీవ్రతను చేస్తామన్నారు

Show More
Back to top button
error: Content is protected !!