
విజయనగరం జిల్లా ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద ట్రాఫిక్ రెగ్యులేషను చేపట్టేందుకు, వాహనాల రాకపోకలను
పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సబ్ కంట్రోల్ ను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జూలై 17న
ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – ఇటీవల కాలంలో ఆర్టీసి కాంప్లెక్స్ ప్రాంతంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిందన్నారు. స్కూల్స్, కాలేజీలు, ఆసుపత్రులు, సినిమా హాల్స్ ఆర్టీసి కాంప్లెక్స్ పరిసరాల్లోనే ఉండడం వలన ఉదయం, సాయంత్రం సమయాల్లో ట్రాఫిక్ రద్దీ తరుచుగా ఏర్పడుతుందన్నారు. రద్దీ సమయాల్లో ట్రాఫిక్
రెగ్యులేషను చేపట్టడం కష్టంగా ఉంటుందని, దీనిని అధిగమించడానికి ఆర్టీసి కాంప్లెక్సు సమీపంలో ట్రాఫిక్ సబ్ కంట్రోల్ ఏర్పాటు చేయాలని సంకల్పించామన్నారు. ఇందులో భాగంగా ఆర్టీసి కాంప్లెక్సు సమీపంలో ట్రాఫిక్ సబ్ కంట్రోల్ ను ఏర్పాటు చేసి, ప్రారంభించామన్నారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ విధులు నిర్వర్తించే సిబ్బంది తీవ్రమైన వేసవి, వర్షా కాలంలో సమర్ధవంతంగా విధులు నిర్వర్తించడానికి ఇబ్బంది లేకుండా సబ్ కంట్రోల్ ఎంతగానో ఉపయోగపడు
తుందన్నారు. అదే విధంగా చిన్న చిన్న దొంగతనాలు, ఈవ్ టీజింగు వంటివి నియంత్రించ వచ్చునన్నారు. ఈ సబ్
కంట్రోల్ రూంలో పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టంను ఏర్పాటు చేసామని, లౌడు స్పీకర్లును ఆర్టీసి కాంప్లెక్సు ఇన్ గేటు, ఔటు గేటు మరియు
పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసామన్నారు. ఈ సబ్ కంట్రోల్ నుండే వాహనాలకు పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్ ద్వారా సూచనలు చేయవచ్చు
నన్నారు. ఈ సబ్ కంట్రోల్లో ఒక ఎస్ఐ, ఒక ఏఎస్ఐ, ఇద్దరు హెచ్సీలు, ముగ్గురు కానిస్టేబుళ్ళు ఉంటారని, వీరు ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా విధులు నిర్వహిస్తారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఆర్టీసి కాంప్లెక్స్ ప్రాంతంలో మరిన్ని సిసి కెమెరాలు
ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పోలీసు అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివానరావు, ట్రాఫిక్ సిఐ సూరి నాయుడు, టూ టౌన్ సిఐ టీ.శ్రీనివాసరావు, రూరల్ సిఐ బి.లక్ష్మణరావు, ట్రాఫిక్ ఎస్ఐలు భాస్కరరావు, శంబంగి రవి, నూకరాజు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.