A2Z सभी खबर सभी जिले की

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని మెడికల్‌ కళాశాలలోకి మార్చాలి

విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలోకి మార్చాలని జిల్లా పౌరవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పురవేదిక జిల్లా అధ్యక్షుడు బీసెట్టి బాబ్జి ఆధ్వర్యంలో ఈ నిరసన కొనసాగింది.
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందికి సరైన సదుపాయాలు లేవని ఈ కారణంగా విశాలంగా ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలోకి మార్చి వైద్య సేవలు అందించాలని కోరారు.

Show More
Back to top button