A2Z सभी खबर सभी जिले की

గంజాయి నియంత్రణే లక్ష్యంగా ఫలక్నుమా టైన్లో ఆకస్మిక తనిఖీలు

*- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్*

రైళ్ళలో గంజాయి అక్రమ రవాణ నియంత్రణే లక్ష్యంగా జూలై 3న రాత్రి ఫలక్నుమా ఎక్స్ప్రెస్ లో లోకల్ పోలీసు, జి.ఆర్.పి., ఈగల్ మరియు ఆర్.పి.ఎఫ్ పోలీసులతో సంయుక్తంగా బృందాలను ఏర్పాటు చేసి, ఆకస్మిక
తనిఖీలు చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జూలై 4న తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – ఈగల్ ఐజి ఆకే రవికృష్ణ ఆదేశాలతో గంజాయి అక్రమ రవాణను నియంత్రించేందుకు ఈగల్, లోకల్ పోలీసు, గవర్నమెంట్ రైల్వే పోలీసు మరియు రైల్వే ప్రొటక్షన్ పోలీసులతో ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి, ఫలక్నుమా ఎక్సప్రెస్ ట్రెయిన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్నారు. గంజాయి ప్రధానంగా ఒడిస్సా రాష్ట్రం నుండి ఇతర ప్రాంతాలకు ట్రెయిన్స్ ద్వారా అక్రమంగా రవాణ అవుతుందన్న సమాచారంతో ప్రత్యేకంగా ట్రెయిన్స్ ను లక్ష్యంగా చేసుకొని తనిఖీలు చేపట్టామన్నారు. ఈ బృందం విజయనగరం రైల్వే స్టేషనులో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ఎక్కి విశాఖపట్నంకు చేరుకొనేలోగా అన్ని భోగీల్లో క్షుణ్ణంగా
తనిఖీలు నిర్వహించామన్నారు. ఈ తనిఖీల్లో పాల్గొన్న పోలీసు సిబ్బందికి, అధికారులకు ముందుగా ప్రయాణికులతో
వ్యవహరించాల్సిన తీరు గురించి డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు వివరించి, వారికి దిశా నిర్ధేశం చేసారు. ఫలక్నుమా ఎక్స్ప్రెస్ లోని అన్ని భోగీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి, బ్యాగులను, లగేజ్, సూట్కేసులను నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. తనిఖీలో ఎటువంటి గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలు
లభించలేదన్నారు. రాష్ట్రంలో గంజాయిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా ఈగల్ టీమ్స్ ను నియమించిందన్నారు. ఈగల్ టీమ్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున వివిధ ట్రెయిన్స్ లో తనిఖీలు చేపట్టా
మన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణ, విక్రయాలు, వినియోగం గురించి సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబరు 1972కు అందించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రజలను కోరారు.
ఈ తనిఖీల్లో బూర్జువలన ఎస్ఐ రాజేష్, జిఆర్పి ఎస్ఐ బాలాజీరావు, ఆర్.పి.ఎఫ్. ఎస్ఐ, 20మంది పోలీసు
సిబ్బంది, డాగ్ స్క్వాడ్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

 

 

Related Articles

Back to top button
error: Content is protected !!