
ఈరోజు వారిజా నేత్ర విద్యా లయ అందుల పాఠశాల, మంగమరిపేట, చిన్న జీయర్ స్వామి ట్రస్ట్, విశాఖపట్నం జిల్లా విద్యార్థులు మధ్య దీపావళి సంబరాలు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్సార్.సీ.పీ. జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త గౌ!!నీ. మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను)గారి కుమార్తె *చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ* వారిజా నేత్ర అంధుల విద్యార్థులు మధ్య ఘనంగా దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ప్రతీ ఒక్కరినీ పేరు పేరునా పలకరించి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసు కున్నారు. వారి చదువు కోసం ఆరా తీసారు. జీవితంలో బాగా చదువు కొని మంచి ఉన్నత స్థాయికి రావాలని వారిని ప్రోత్సహించారు. వారితో కొంత సేపు ఆనందంగా గడిపారు.
ఈ కార్యక్రమం లో ఇల్లపు వెంకట జగన్ ఎక్స్ జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్,పాల్ రమణ భీమిలి నియోజకవర్గం యూత్ ప్రెసిడెంట్,పాల్ అశోక్ రెడ్డి, మహేష్ పాలవలస, బాలు సంతోష్,ఎర్రయ్య రెడ్డి, చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోట వాసు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

