A2Z सभी खबर सभी जिले की

*నగరం అష్టదిగ్బంధం..!*      

భక్తుల అవస్థలు..!! సిరీ మాను చుట్టూ టీ షర్ట్ బ్యాచ్

ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పోలీసులు తమ అతి ఉత్సాహంతో భక్తులను ఇక్కట్లకు గురి చేశారు. మంగళవారం ఉదయం నుంచి పోలీసులు నగరాన్ని అష్ట దిగ్బంధనం చేశారు. నగరంలోకి ఎవరిని అనుమతించకుండా దాదాపు నిషేధం విధించినట్లే వ్యవహరించారు. పోలీసు రెవెన్యూ వాహనాలు మాత్రం నేరుగా అమ్మవారి గుడి వద్దకు వచ్చేందుకు వెసులుబాటు కల్పించారు.

దీంతో భక్తులు సిరిమాను రథయాత్ర చూసేందుకు అవస్థలు పడాల్సి వచ్చింది. నగరంలో పోలీసులు రెవెన్యూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే శ్రీ పైడితల్లి అమ్మవారి గుడి లోపల సిబ్బంది తమ ఇష్టానుసారం వ్యవహరించడంతో ఈ పైడితల్లి అమ్మవారి దర్శన భాగ్యం సామాన్యులకు కరువైంది.

వదిలేశారు..!

Related Articles

విచిత్రం ఏమిటంటే సినిమాను రథయాత్ర ప్రారంభమయ్యేసరికి ఎప్పటి మాదిరిగానే ఎక్కడెక్కడ జనం వచ్చేశారు. సిరిమాను రథయాత్ర ప్రాంతంలోకి పలువురిని పోలీసులు వదిలేశారు. పోలీసులు ఎప్పటిలాగే సిరిమాను రథయాత్ర చుట్టు రక్షణ వలయంగా ఉండేందుకు ఎన్ సి సి క్యాడేట్ లను, రెడ్ క్రాస్ సభ్యులను వినియోగించుకున్నారు. వారు మాత్రం అజమానిష్ చేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తూ కాలక్షేపం చేశారు. ఎప్పటి మాదిరిగానే అంజలి రధం బెస్తవాన్ని ఇవాళ తల్ల ఏనుగు తో పాటు అనేకమంది వాళ్లు కేటాయించిన బణీలు వేసుకుని దూసుకొచ్చారు. దీంతో రథయాత్ర ప్రారంభానికి ముందు నుంచి అక్కడ రద్దీ తొక్కిసులాట జరిగింది. రథయాత్ర ప్రారంభంలో ముందు వెనక కూడా జనం చేరడంతో అంతా కూడా గందరగోళంగా మారింది. ప్రజా ప్రతినిధులు రాజకీయ నేతలు ఉన్నతాధికారులు రాకపోకలకు అనుగుణంగా మాత్రమే పోలీసులు వ్యవహరించారు అన్న విమర్శలు వెలువత్తాయి. పోలీసులు తీరును భక్తులు తప్పు పట్టారు. ఉత్సవాలంటే ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులు ఉన్నతాధికారులకే పరిమితం చేస్తున్నారని పలువురు వాపోయారు. ఎక్కడెక్కడ నుంచో వచ్చిన పోలీసులు అంతా మా ఇష్టం అన్నట్లుగానే ఎగిరెగిరి పడ్డారు. దీనివల్ల సామాన్య భక్తులు పలు ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది

Show More
Back to top button
error: Content is protected !!