A2Z सभी खबर सभी जिले की

నిబంధనలు అతిక్రమించిన ద్విచక్ర వాహనదారులపై చర్యలు

*- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్*

రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్ గారి ఆదేశాలతో రహదారి భద్రత, ప్రమాదాల నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలోని బ్లాక్ స్పాట్స్ వద్ద విస్తృతంగా తనిఖీలు చేపట్టి నిబంధనలు
అతిక్రమించిన ద్విచక్ర వాహనదారులపై 955 కేసులు నమోదు చేసి, రూ. 4,77,460/-ల నగదును ఈ-చలానాగా
విధించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ ఆగష్టు 28న తెలిపారు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్ గారి అదేశాలతో రహదారి భద్రతకు జిల్లా వ్యాప్తంగా బ్లాక్ స్పాట్స్ వద్ద గత వారం రోజులుగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, రహదారి
భద్రత నిబంధనలు ఉల్లంఘించిన ద్విచక్ర వాహనదారులపై 955 కేసులు నమోదు చేసి, రూ. 4,77,460/-లను
ఈ-చలానాగా విధించామన్నారు. బ్లాక్ స్పాట్స్ వద్ద వాహన తనిఖీలు చేపట్టి ద్విచక్ర వాహనాలను ప్రమాదకరంగా నడిపిన వారిపై 88 కేసులు, హెల్మెట్స్ ధరించని ద్విచక్ర వాహనదారులపై 155 కేసులు, మైనరు డ్రైవింగు చేస్తున్న వారిపై 8 కేసులు, డ్రైవింగు లైసెన్సు లేని ద్విచక్ర వాహనదారులపై 471 కేసులు, ద్విచక్ర వాహనాల డ్రైవర్లు, పిలియన్ రైడర్స్ భద్రత నియమాలు ఉల్లంఘించిన వారిపై 46 కేసులు, నంబరు ప్లేట్స్ సక్రమంగా లేని ద్విచక్ర వాహనదారులపై
187 కేసులు నమోదు చేసామన్నారు. రహదారి భద్రత నియమాలు స్పెషల్ డ్రైవ్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ
పోలీసు స్టేషను పరిధిలోని బ్లాక్ స్పాట్స్ వద్ద వాహన తనిఖీలు చేపట్టామన్నారు. ద్విచక్ర వాహనదారులకు రోడ్ సేఫ్టీ నిబంధనల గురించి మరియు హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం వలన కలిగే అనర్ధాలను సంబంధిత అధికార్లు వివరించి, కౌన్సిలింగ్ నిర్వహించారన్నారు. వాహనదారుడుతోపాటు ద్విచక్ర వాహనంకు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలన్నారు. ప్రతీ వాహనదారుడు భద్రత ప్రమాణాలను పాటిస్తూ, సురక్షితంగా గమ్య స్థానాలు చేరుకోవాలన్నారు. రహదారి భద్రత నియమాలను అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పనని వాహనదారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరించారు.
ఈ ప్రత్యేక డ్రైవ్ ను విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్పీ జి.భవ్యరెడ్డి, చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు పర్యవేక్షించారన్నారు.

Back to top button
error: Content is protected !!