A2Z सभी खबर सभी जिले की

తక్కువ వడ్డీకే రుణాలు అందించడమే సెంట్రల్ బ్యాంక్ లక్ష్యం * తక్కువ వడ్డీకే రుణాలు * డిపాజిట్లపై అధిక వడ్డీ * ఏజీఎం శ్రీనివాస నాయుడు వెల్లడి

తక్కువ వడ్డీతో రుణాలు అందించడమే ది జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఏజీఎం అరసాడ శ్రీనివాస్ నాయుడు పేర్కొన్నారు. సెంట్రల్ బ్యాంక్ విజయనగరం ఆదేశాల మేరకు చల్లపేట బ్రాంచి ఆఫీస్ సిబ్బంది తో మెంటాడ వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయంలో విశ్రాంత ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏజీఎం శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ సహకార బ్యాంకులు రైతులకు మాత్రమే రుణాలు అందిస్తుందని చాలామంది అపోహ పడుతున్నారు. చల్లపేట సెంట్రల్ బ్యాంక్ బ్రాంచి లో ఖాతాదారులకు అనేక రకమైన రుణాలు తక్కువ వడ్డీకే ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన, సురక్ష భీమా యోజన, అటల్ పింఛన్ యోజన, చెక్ బుక్ సదుపాయం, రూపే డెబిట్ కార్డ్ ( పరిమితి లేని లావాదీవేలు ఉచితంగా), ఆన్లైన్ ఫండ్ ట్రాన్స్ ఫర్‌ సదుపాయాలతో పాటు వ్యక్తిగత లోన్లు, ట్రాక్టర్ లోన్లు, మైనర్ ఇరిగేషన్( బోర్లు), క కోళ్ల ఫారం, మేకలు గొర్రెలు రుణాలు, పొదుపు సంఘాలకు రుణాలు, సహకార విద్యా రుణం, గృహ తనఖారుణం, గృహ నిర్మాణం కొరకు రుణాలు, చిరు వ్యాపారాలకు రుణాలు నాబార్డ్ నిబంధనలు అనుసరించి సబ్సిడీ కూడా అందించడం జరుగుతుందని శ్రీనివాస్ నాయుడు ఖాతాదారులకు వివరించారు. ఖాతాదారులు పెద్ద సంఖ్యలో చేర్పించాలని, డిపాజిట్లు అధిక మొత్తంలో సేకరించాలని సిబ్బందికి అయన సూచించారు. విశ్రాంతి ఉపాధ్యాయులను దుస్సాలులతో సత్కరించారు. ఉపాధ్యాయుల ద్వారా ప్రతి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనిఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్ పర్సన్ గొర్లె ముసలి నాయుడు, చల్లపేట బ్రాంచి మేనేజర్ పాండ్రంకి శ్రీనివాసరావు, పిఎసిఎస్ సీఈవో వెంపడాపు ప్రసాదరావు, సన్మాన గ్రహీత విశ్రాంతి ఉపాధ్యాయులు గండ్రేటి అప్పలనాయుడు, మండల తిరుపతరావు,ముగడ ప్రభాకర్ ఆచారి, వెళ్లి పైడి పు నాయుడు, బ్రాంచి సూపర్వైజర్ నారాయణరావు, పి చిరంజీవి, పి విశ్వేశ్వరరావు మండల విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Back to top button
error: Content is protected !!