A2Z सभी खबर सभी जिले की

*పారా జాతీయ అథ్లెటిక్స్ లో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు *

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ అటల్ బిహారి వాజ్ పాయి స్టేడియం వేదికగా పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన 14వ పారా జూనియర్, సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ -2025 పోటీల్లో జిల్లాకు చెందిన పారా క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభతో సత్తా చాటారని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె. దయానంద్ తెలిపారు. బొబ్బిలి ఆసియన్ ఎయిడెడ్ బ్లైండ్ స్కూల్ కు చెందిన టునా గమంగా (ఎఫ్ -12 కేటగిరి ) జావలెన్ పోటీలో గోల్డ్ మెడల్ సాధించగా, టి -13 కేటగిరికి సంభందించి లాంగ్ జంప్ లో జి. నందిని సిల్వర్ మెడల్ సాధించిందని, అలాగే మొదటి సారి జాతీయ పోటీల్లో పాల్గొన్న సాయి కొరియన్ క్యాంపస్ ఛాలెంజ్ కు చెందిన కొంతల సోములమ్మ (టి-38 కేటగిరి) 100 మీటర్లు పరుగులో సిల్వర్ మెడల్, 400 మీటర్ల పరుగులో బ్రాంజ్ మెడల్, సాధించి అందరి దృష్టిని ఆకర్షించిందన్నారు. మెడల్స్ సాధించిన క్రీడాకారులకు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గోనుగుంట్ల కోటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వి.రామస్వామి, జిల్లా గౌరవ అధ్యక్షులు కె. దయానంద్ లు అభినందనలు తెలియజేసారు. కృషి, పట్టుదల, అసామాన్య ప్రతిభతో జిల్లా, రాష్ట్రం పేరును జాతీయ స్థాయిలో మారుమ్రోగేలా చేసారని ప్రశంసించారు.

Back to top button
error: Content is protected !!